డయాబెటిక్ రెటినోపతి వస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా డయాబెటిస్ తో( Diabetes ) చాలా బాధపడుతూ ఉన్నారు.

రక్తంలో షుగర్ స్థాయిలు పెరగడం వలన డయాబెటిస్ పెరిగిపోయి, ప్రజలందరూ ఆందోళన చెందుతున్నారు.

అయితే కొన్ని కీలక టెస్టులు చేసుకోవడం మాత్రం డయాబెటిస్ పేషెంట్లకు చాలా అవసరం.ముఖ్యంగా డయాబెటిక్ రెటినోపతి వ్యాధి( Diabetic Retinopathy ) ఈ మధ్యకాలంలో డయాబెటిస్ ఉన్న ప్రతి బాధితులకు బాగా దెబ్బతీస్తోంది.

చాలామందికి దీని పై అవగాహన ఉండదు.ఈ నేపథ్యంలో డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటో దానికి సంబంధించిన లక్షణాలు నివారణ మార్గాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చిన్న వయసులోనే డయాబెటిస్ తో ఈ మధ్యకాలంలో చాలామంది బాధపడుతున్నారు.అలాంటి వారు కాలక్రమేన, రక్తంలో షుగర్ స్థాయిలు( Blood Sugar Levels ) పెరిగి అవి రెటీనా ను దెబ్బతీస్తాయి.డయాబెటిక్ రెటినోపతి బారిన పడకుండా ఉండాలంటే డయాబెటిస్ తో ఉన్నవారు ప్రారంభంలోనే రక్తంలో షుగర్, బీపీ స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

Advertisement

అందుకు అమెరికా వైద్య బృందం మంచి చికిత్సను సూచిస్తుంది.డయాబెటిస్ ప్రారంభ దశలో టైప్ 1 డయాబెటిస్ ఉన్న వారిలో 52%, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో 56% మందిలో డయాబెటిస్ రెటినోపతి పరిస్థితి ఉన్నట్లు గమనించడం జరిగింది.

అయితే జనాభాలో డయాబెటిక్ రెటినోపతి పట్ల గురించి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది.

కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం వలన కంటిని( Eyes ) డయాబెటిక్ వ్యాధి బారిన పడకుండా కాపాడుకోవచ్చు.అందులో మొదటిది HBA1C.ఈ పరీక్ష ద్వారా డయాబెటిస్ ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది.

బేస్ లైన్ రెటీనా పరీక్ష చేయించుకోవడం వలన డయాబెటిస్ రెటినోపతి బారిన పడ్డారా లేదా అన్నది కూడా తెలుసుకోవచ్చు.ఈ విధంగా డయాబెటిక్ రెటినోపతి సమస్యలను నివారించడానికి శారీరక వ్యాయామం, సమతుల్య ఆహారంతో డయాబెటిస్ నియంత్రణలో పెట్టుకోవాలి.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

అసలు డయాబెటిక్ రెటినోపతి వస్తే దృష్టిని కోల్పోవడం, అంధత్వం రావడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు