పాపం సుధీర్ బాబు .. ఎన్ని సినిమాలు చేసిన లక్కు చిక్కడం లేదే ?

సూపర్ స్టార్ హీరో కృష్ణకి అల్లుడిగా, మహేష్ బాబు కి బావగా సినిమా ఇండస్ట్రీకి లాంచింగ్ ఈజీ గానే చేసుకోబడ్డ హీరో సుదీర్ బాబు.

ఇప్పటికి కూడా అతడిని కేవలం కృష్ణ గారి అల్లుడుగానే చూడటం లేదా మహేష్ బాబు బావ అంటూ సంభోదించడం వల్ల సుదీర్ బాబు ఎస్టాబ్లిష్డ్ హీరో కాలేదు అని చెప్పకనే చెప్పేస్తున్నారు.

దానికి గల ముఖ్య కారణం ఇప్పటివరకు అతడి కెరియర్లో సరైన హిట్టు లేకపోవడమే.అనేక సినిమాలో నటిస్తున్న ఎందుకో సుధీర్ బాబుకి లక్కు కలిసి రావడం లేదు.

అయినా మిగతా హీరో లాగా ఆరంభమే మాస్ ఎలిమెంట్స్ తో, కమర్షియల్ హీరోగా లాంచ్ అవ్వాలని ఆ ప్రయత్నించలేదు.సాలిడ్ గా భిన్నమైన రీతిలోనే కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు.

వెరైటీ ఉండాలని కోరుకుంటున్న సుధీర్ బాబుకు క్లిక్ రాకపోవడమే బాధాకరం.పోనీ అతడు ఏమైనా మరి నాసిరకవు హీరోనా అంటే ఖచ్చితంగా కాదు.

Advertisement

మంచి బాడీ.చూడ్డానికి అందం.

బ్యాగ్రౌండ్.మెరిట్ అన్ని హంగులు ఉన్నాయి ఒక కమర్షియల్ హీరోకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సుధీర్ బాబు లో ఉన్నాయి కానీ కేవలం సుడి మాత్రమే తిరగడం లేదు.

పైగా ఏదైనా సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు తగ్గట్టుగా తన బాడీని కూడా మలుచుకోగలడు.అలాగే హీరో గానే ఉండాలని కోరిక ఏమి లేదు, తనదైన మంచి పాత్ర వస్తే విలన్ గా నటించడానికి కూడా సంసిద్ధంగానే ఉన్నాడు సుదీర్ బాబు.ఎటు తిరిగి దక్కాల్సింది లక్కు కొట్టాల్సింది హిట్టు మాత్రమే.

ఇక హంట్ అంటూ ఒక ప్రయోగాత్మక సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు.

జాంబిరెడ్డి సినిమా సీక్వెల్ లో నటిస్తున్న తేజ సజ్జా.. మరో బ్లాక్ బస్టర్ ఖాయం!
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

కానీ ఈ సినిమా కూడా అంతంత మాత్రమే.మంచి కథనే తీసుకున్నప్పటికీ మంచి దర్శకుడు చేతిలో పడలేదని అర్థమవుతుంది.కానీ ఇంతటి చాలెంజింగ్ పాత్రను సుధీర్ బాబు ఒప్పుకోవడం నిజంగా అభినందించాల్సిన విషయం.

Advertisement

కానీ క్లిక్ అవ్వడమే చాలా కష్టంగా మారింది.ఎందుకంటే ఇప్పటికే ఇలాంటి సినిమాలు పోలడం చూసేసాం.

పైగా ఓటీటీ చూస్తున్న ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు ఏమీ కొత్త కాదు.ఎంత హైటెక్నికల్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేసిన సినిమా చూడదగ్గగా ఏమీ లేదు.

తాజా వార్తలు