మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ అధినేత పవన్ గురువారం ప్రసంగించడం తెలిసిందే.తన ప్రసంగంలో భాగంగా ఎవరు పడితే వారు ప్రాంతాలను విడగొడుతూ రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.
ఈ క్రమంలో ప్రత్యేక రాయలసీమ అంటూ ఒక ముసలాయన అంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో తనపై చేసిన వ్యాఖ్యల విషయంలో పవన్ పై బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాయలసీమ అంటూ నా పేరు ప్రస్తావించాల్సిన హక్కు పవన్ కళ్యాణ్ కి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.వైసీపీ ప్రభుత్వంపై జగన్ ప్రభుత్వ పాలసీలపై విమర్శలు చేస్తున్నారు అక్కడ దాక ఓకే.కానీ నా గురించి ఆయన మాట్లాడటం సమంజసం కాదని చెప్పుకొచ్చారు.మరి ఆనాడు రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు.
పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అని నిలదీశారు.తెలంగాణలో నిధులు.
నియామకాలు ఇంక నీరు వంటి విషయాలలో తారతమ్యాలు రావడంతో ప్రత్యేక తెలంగాణ నినాదం మొదలయ్యింది.
అదే విధంగా.రాయలసీమలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి.ఈ ప్రాంతానికి అడుగడుగున ఎన్నో అన్యాయాలు జరిగాయి.
మరి ఖచ్చితంగా ప్రత్యేక రాయలసీమ అనే నినాదం లెగుస్తుంది.ఎవరు కూడా దీన్ని ఆపలేరు అని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు.
ఒకప్పుడు రాయలసీమకు వచ్చి.నా మనసుకు కర్నూలు రాజధాని అని అన్నారు తర్వాత మాట మార్చారు.
అనంతపురంలో పాదయాత్ర చేస్తానని మళ్లీ వెనక్కి తగ్గటం జరిగింది అంటూ పవన్ పై తనదైన శైలిలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కౌంటర్ లు వేశారు.