దాసరి, హీరో శోభన్ బాబు మధ్య అలాంటి సంభాషణ.. చివరికి ఏం జరిగిందంటే?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా స్టార్ హీరోలు మంచి పేరు ఉన్న దర్శకులకు మాత్రమే అవకాశాలు ఇస్తుంటారు.ఇది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న పరిస్థితి.

కొత్తగా ఏ దర్శకుడైన ఇండస్ట్రీలోకి అడుగు పెడితే తనకు స్టార్ హీరోల నుంచి అవకాశాలు రావడం చాలా అరుదని చెప్పవచ్చు.అయితే కొత్తగా వచ్చిన వారికి కూడా అవకాశం ఇవ్వాలి కనుక కొందరు హీరోలు మాత్రం ఎంతో ధైర్యం చేసి ఆ దర్శకులకు అవకాశాలు ఇస్తుంటారు.

ఇలాంటి ఘటన లెజెండరీ డైరెక్టర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న దాసరి నారాయణరావు కూడా ఎదురైందని చెప్పవచ్చు.దాసరి నారాయణరావు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో శోభన్ బాబును దృష్టిలో ఉంచుకొని "తాతా మనవడు" కథను రాశారు.

ఈ సినిమాలో ఎస్ వి రంగారావు రాజబాబు నటించడంతో ఈ సినిమా ద్వారా వారికి ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.నిజానికి ఈ సినిమాలో రాజబాబు పాత్రలో శోభన్ బాబును ఊహించుకొని కథ సిద్ధం చేసుకున్నారు దర్శకుడు దాసరి.

Advertisement
What Is The Conversation Between Dasari And Shoban Babu, Dasari, Shobhan Babu,

అయితే దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి కొత్తగా రావడంతో అతనితో సినిమా చేయడానికి శోభన్ బాబు ధైర్యం చేయలేకపోయారు.ఈ క్రమంలోనే ఈ సినిమాను ఎస్ వి రంగారావు రాజబాబుతో దాసరి నారాయణరావు తెరకెక్కించారు.

What Is The Conversation Between Dasari And Shoban Babu, Dasari, Shobhan Babu,

ఈ సినిమా థియేటర్లలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.అంతేకాకుండా ఈ సినిమాకు నంది అవార్డు రావడం గొప్ప విశేషమని చెప్పవచ్చు.ఈ విధంగా మొదటి సినిమాకి నంది అవార్డు దక్కించుకున్న దాసరి నారాయణరావు సినిమా ఇండస్ట్రీలో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు.

అయితే ఈ సినిమాలో నటించినందుకు గానూ శోభన్ బాబు ఎంతో ఫీలయ్యారని, ఆ తరువాత పలు సార్లు దాసరి నారాయణరావు కనిపించినప్పుడు తన దగ్గర ఇదే విషయాన్ని మాట్లాడేవారని, ఆ తర్వాత శోభన్ బాబు దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కి మంచి విజయాన్ని అందుకున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు