ఇప్పుడంటే అందరికీ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి.కానీ ఒకప్పుడు చాలా మంది నేలపైనే నిద్రించేవారు.
చాప, దుప్పటి, దిండు వేసుకుని హాయిగా పడుకునేవారు.ఇప్పటికీ కొందరు ఇది ఫాలో అవుతుంటారు.
బెడ్ సౌకర్యం ఉన్న కూడా నేలపైనే పడుకుంటూ ఉంటారు.శరీరానికి సౌకర్యంగా ఉంటే, నేలపై నిద్రించడం( Sleeping On The Floor ) వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
మృదువైన మెత్తని బెడ్లు వెన్నెముకను( Spine ) వంగిపోయేలా చేయవచ్చు, కానీ నేలపై నిద్రిస్తే అది నివారించవచ్చు.నేల గట్టిగా ఉండటం వల్ల కింద నిద్రించటం అలవాటు చేసుకుంటే శరీరం సరైన పొజిషన్‌లో ఉంటుంది.
మోకాలు, వెన్నెముకకు మంచి సపోర్ట్ లభిస్తుంది.కొన్ని సందర్భాల్లో పాత వెన్నునొప్పులకు నేలపై నిద్రించడం ద్వారా మంచి ఉపశమనాన్ని పొందుతారు.

అలాగే నేలపై నిద్రించడం వల్ల రక్త ప్రసరణ( Blood Circulation ) సాఫీగా జరుగుతుంది.దాంతో హృదయానికి పని తక్కువగా ఉంటుంది.చిన్న వయసు నుంచి నేలపై నిద్రించడం అలవాటు చేసుకుంటే.శరీర దృఢత్వానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ప్రస్తుత వేసవి కాలంలో నేలపై పడుకోవడం వల్ల శరీరం చల్లబడుతుంది.ఒంట్లో వేడి తగ్గుతుంది.

కొంత మందిలో నేలపై నిద్రించడం వల్ల నిద్ర నాణ్యత అనేది మెరుగుపడుతుంది.నిద్రలో డీప్ స్టేజ్‌లకు చేరే అవకాశం పెరుగుతుంది.అయితే నేలపై నిద్రించడం కొందరికి ఉపయోగపడినా, కొందరికి మాత్రం అసౌకర్యంగా, కష్టతరంగా ఉండొచ్చు.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు నేలపై పడుకోరాదు.ఆస్టియోఆర్థ్రైటిస్, డిస్క్ బల్జ్, స్కోలియోసిస్ వంటివి ఉన్న వారు నేలపై పడుకుంటే నొప్పి పెరిగే ప్రమాదం ఉంది.అలాగే దుమ్ము ఎక్కువగా ఉన్న ప్రదేశంలో నిద్రిస్తే.
శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశముంటుంది.తక్కువ బాడీ టెంపరేచర్ ఉన్నవారు కూడా నేలపై పడుకోరాదు.
నేల చల్లగా ఉంటుంది కాబట్టి.జలుబు, తిమ్మిరి, కండరాల గట్టిపడే సమస్యలు రావచ్చు.