చండీ యాగం చేయడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఇవే...

లోకకల్యాణం కోసం, ఈ జగత్తు సృష్టికి మూలం విశేష కార్యసిద్ధికి మూలకారణమైన సాక్షాత్తు ఆ జగన్మాతను పూజించడం తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ.

ఈ అమ్మవారిని పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి.

ఆదితత్వాన్ని నేత్ర మూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసన శ్రీవిద్య ఆది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలుగా ఉంటుంది.సాధారణంగా చండీ యాగాన్ని దుష్టశక్తులను సంహరించడానికి, శత్రువుల నుంచి రక్షణ పొందడానికి ఈ యాగాన్ని నిర్వహిస్తుంటారు.

ఈ చండీయాగాన్ని మూడు పద్ధతులలో ఆచరిస్తారు.అవి హోమం,పూజ, పారాయణం అనే మూడు పద్ధతుల ద్వారా ఆ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు.

అలాగే పారాయణంలో తిరిగి దశాంశ పారాయణం, దశాంశ తర్పణం ఇస్తారు.

Advertisement

సాధారణంగా చండీ హోమం అంటే ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతి పారాయణం చేసి, హోమం నిర్వహించడమే చండీ యాగం.దేశోపద్రవాలు శాంతిచడానికి,గ్రహాలఅనుకూలత,శత్రు సంహారానికి, భయభ్రాంతుకు తొలగిపోవడానికి శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాల చేత ఈ చండీ యాగం నిర్వహిస్తారు.కలియుగంలో అత్యంత శక్తివంతమైనది చండీ పారాయణం.

ఈ చండీయాగాలలో ఏకాదశ చండీ యాగం చేస్తే రాజు వశమవుతాడని , ద్వాదశ చండీయాగం చేస్తే శత్రువు నాశనం అవుతాడని మార్కండేయ పురాణం తెలియజేస్తుంది.ఇక శత చండీ యాగం చేస్తే కష్టాలు,అనారోగ్య సమస్యలు,ధననష్టం తొలిగిపోతాయి.సహస్ర చండీయాగం చేయటం ద్వారా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక లాభం కలగడమే కాకుండా,అనుకున్న కోరికలు నెరవేరుతాయి.10 లక్షల చండీ పారాయణం చేయడం ద్వారా మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి.చండీయాగం చేయటం ద్వారా సకల కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.

ఎక్కడ చండీ యాగం నిర్వహించబడుతుందో అక్కడ దుర్భిక్షం దుఃఖం అనేది ఏర్పడదు.ఆ ప్రాంతంలో అకాల మరణాలు సంభవించవు.లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మస్వరూపిణి అయిన ఆ పరమేశ్వరులను పూజించడం వల్ల మనకు శుభం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పెరుగుతో అందానికి మెరుగు.. ఇంతకీ ఏయే సమస్యకు ఎలా వాడాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు