సంచలన రిపోర్ట్ : అమెరికాలో ఇవి తింటున్నారా....అయితే మీ హెల్త్ డ్యామేజ్ ఖాయం..

పూర్వం మనిషి 100 ఏళ్ళు బ్రతికేవాడు, ఎంతో ఆరోగ్యంగా, బలమైన శరీరంతో 70 ఏళ్ళ వయసు వచ్చినా సరే గెడ కర్రలా నిటారుగా నడుస్తుంటారు.ప్రస్తుత కాలంలో కూడా అప్పటి తరం వాళ్ళు మన ముందు అలా తిరుగుతుంటే నోళ్ళు వెళ్ళ బెట్టుకుని ఆశ్చర్యంగా వారిని చూస్తూ ఉంటాం.

 Science Confirms The Obvious Fast Food Is Pretty Bad For You, Fast Food, Pizza,-TeluguStop.com

కానీ ప్రస్తుత సమాజంలో 40 ఏళ్ళు రాకుండానే బీపీ, షుగర్, కీళ్ళ నెప్పులు, ఇలా ఏదో ఒక రోగంతో కుచించుకుపోయిన యువకులు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు.ఇక ఎన్నేళ్ళు బ్రతుకుతామో కూడా గ్యారెంటీ లేని పరిస్థితి.

అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి…?? అసలు మనం తినే తిండిలో ఎంత వరకూ మంచి ఉంది.?? ఇలాంటి విషయాలపై పరిశోధన చేసిన అమెరికాలోని శాస్త్రవేత్తల బృందం సంచలన విషయాలు వెల్లడించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఫాస్ట్ ఫుడ్ కు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.ప్రతీ ఒక్కరూ పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్ అంటూ రకరకాల ఆహారాలు తింటున్నారు.

అయితే అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు వీటిని తింటే ఇక మీకు డేంజర్ బెల్స్ మొగినట్టేనని, మీ ఆరోగ్యం డ్యామేజ్ అవ్వడం ఖాయమని అంటున్నారు.అమెరికాకు చెందిన జార్జ్ వాషింగ్టన్ , బోస్టన్, హార్వర్డ్ వర్సిటీలు అలాగే టెక్సాస్ లోని సౌత్ వెస్ట్ రిసర్చ్ ఇన్స్టిట్యూట్ లోని శాస్త్రవేత్తలు కలిసి సంయుకటంగా ఓ పరిశోధనలు చేపట్టారు.

పిజ్జాలు, బర్గర్లు తయారు చేయడానికి అమెరికాలో ప్రఖ్యాత హోటల్స్ సబ్బులు, షాంపో సర్ఫ్ లు తయారీలో వాడే రసాయనాలను వాడుతున్నారని సంచలన ప్రకటిన చేశారు. మెక్ డోనాల్డ్, బర్గర్ కింగ్, పిజ్జా హాట్, డామినోస్ వంటి పెద్ద పెద్ద ఆహార సంస్థలు సైతం ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నట్టుగా సదరు సర్వే తేల్చి చెప్పింది.

వారు చేసిన ఈ మొత్తం అధ్యయనాలను ఎక్స్ పోజర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వీక్లీ జర్నల్ లో ప్రచురించారు.వీరి పరీక్షలలో ఆయా హోటల్స్ నుంచీ తెచ్చిన ఆహార పదార్ధాలలో ప్లాస్టిక్ మృదువుగా ఉండేందుకు కలిపే ప్తాలేట్లు వాడుతున్నారని ఇవి మెదడు, కిడ్నీ, ఆస్తమా వంటి వ్యాధులను కలుగజేస్తాయని వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube