ప్రస్తుత ప్రపంచంలో ఎవరి జీవితం ఏ విధంగా మారుతుందో ఎవరికీ అర్థం కావటం లేదు.ముఖ్యంగా కరోనా వైరస్ దెబ్బకి చాలామంది జీవితంపై పెట్టుకున్న నిర్ణయాలు అన్ని తలకిందులు అయిపోయాయి.
ఇలాంటి తరుణంలో చాలామంది ఉద్యోగాలు కూడా పోతున్న పరిస్థితి.ప్రపంచంలో పరిస్థితి ఇలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో ఒక వ్యక్తి తన స్నేహితుడిని కలవడానికి వెళ్లి కోటీశ్వరుడు అయిపోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
విషయం ఏమిటంటే కర్ణాటక రాష్ట్రంలో మాండ్యా కు చెందిన సోహన్ బలరాం అనే వ్యక్తి కోటి రూపాయల లాటరీ గెలిచాడు.
అనుకోకుండా లాటరీ కొనటం, అతడు గెలవడంతో.
ఇప్పుడు అతని పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఫ్రెండ్ ని కలవాలని కర్ణాటక నుండి సోహన్ బలరాం కేరళ వెళ్ళాడు.
స్నేహితుడిని అంతా కలిసి తిరిగి ఇంటికి చేరుతున్న క్రమంలో మధ్య దారిలో స్నేహితులు లాటరీ టికెట్లు కనిపిస్తే కొనమని బలరాముని బలవంతం చేస్తే అతడు కొనడం జరిగింది.వంద రూపాయలు పెట్టి టికెట్ కొన్న బలరాం.
ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అతడికి కోట్ల రూపాయలు బంపర్ ప్రైజ్ తగిలినట్టు ఫోన్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయాడు.ఆ తర్వాత షాక్ నుండి తేరుకుని ఆనందంతో మునిగితేలుతున్నడు.
ఒక ప్రయాణం, అది స్నేహితుడిని కలవడానికి వెళ్లిన ప్రయాణం అతడి జీవిత రూపురేఖలను మార్చడంతో సోహన్ బలరాం పేరు కర్ణాటక, కేరళ రాష్ట్రంలో మారుమ్రోగుతోంది.
