కంప్యూటర్ లో వాట్సాప్ .. ఇప్పుడు పూర్తిగా సిద్ధం

కంప్యూటర్ లో వాట్సాప్ ఎలా వాడాలో ఇక్కడ అందరికి తెలిసిన విషయమే కదా.ఒకవేళ ఎవరైనా తెలియని వారు ఉంటే చెప్తున్నాం వినండి.

కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో ఇంటర్నెట్ వాడుతూ, https://web.whatsapp.com/ లోకి వెళ్లి, మొబైల్ లో మీ వాట్సాప్ అప్లికేషన్ ని ఓపెన్ చేసి, ఆప్షన్స్ లో Whatsapp Web మీద క్లిక్ చేయగానే ఆటోమెటిక్ గా ఒక స్కానార్ ఓపెన్ అవుతుంది.ఇప్పుడు https://web.whatsapp.com/ లో కనిపించే ఒక QR Code ని మీ మొబైల్ లో కనిపిస్తున్న స్కానర్ తో స్కాన్ చేయాలి.

ఇలా స్కాన్ చేయగానే మీ కంప్యూటర్ తెర మీద మీ వాట్సాప్ అకౌంట్ కనబడుతుంది.ఈ అప్డేట్ వచ్చి చాలా కాలమైనా, మొబైల్ వాట్సాప్ లో ఇస్తున్న అన్నిరకాల ఆప్షన్స్ వెబ్ వాట్సాప్ కి కూడా ఇవ్వటం ఇప్పుడు జరిగింది.

అచ్చం మొబైల్ వాట్సాప్ లో మార్చుకున్నట్లే, వెబ్ వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ మార్చుకోవడమే కాదు, ఇప్పుడు గ్రూప్ చాట్స్ లో మీ మిత్రులని వెబ్ వాట్సాప్ లో కూడా మేన్షన్ చేయవచ్చు.అంతే కాదు, మేసేజేస్ ఉన్న లింక్స్ కూడా వాడుతున్న బ్రౌజర్ లోనే చూసుకోవచ్చు.

Advertisement

చాట్స్ ని ఆర్చీవ్ లో పెట్టడం, డిలీట్ చేయడం కూడా చేసుకోవచ్చు.మరింకెందుకు ఆలస్యం, కంప్యుటర్ లో ఇటు మీ పని చేసుకుంటూనే, అటు వాట్సాప్ లో కబుర్లు పెట్టేయండి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు