మహేష్ బాబుకి కల్ట్ క్లాసిక్ “అతడు” ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన, మహేష్ పండించిన కామెడీకి బాగానే మార్కులు పడ్డాయి.
కాని ఆ ఫలితం వలన మహేష్ మళ్ళీ త్రివిక్రమ్ తో సినిమా చేయకపోవచ్చని అప్పటినుంచే వార్తలు మొదలయ్యాయి.
త్రివిక్రమ్ మహేష్ తో సినిమా ప్రకటించాక కూడా మహేష్ సడిచప్పుడు లేకుండా ఉండటంతో ఈ వార్తలు నిజమేనేమో అనే అనుమానం పెరిగింది.
ఇక త్రివిక్రమ్ ని కాదని, శ్రీకాంత్ అడ్డాలకి బ్రహ్మోత్సవం అవకాశమివ్వడంతో ఖచ్చితంగా మహేష్ త్రివిక్రమ్ ని దూరం పెడుతున్నాడని అనుకున్నారంతా.ఇంతలో మహేష్ 25వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అని వార్తలు వచ్చినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.
ఆ సినిమా జరిగేటప్పుడు చూద్దాం అనే కామెంట్స్ వినిపించాయి.ఇక ఈ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే రూమర్లన్నిటికి తెర దించాడు మహేష్.
ఈరోజు త్రివిక్రమ్ పుట్టినరోజు.మహేష్ త్రివిక్రమ్ తో తన జ్ఞాపకాలని నెమరువేస్తూ, తన ట్విట్టర్ ఖాతా ద్వారా త్రివిక్రమ్ కి శుభకాంక్షలు తెలిపాడు.
తమ మధ్య ఎలాంటి వైరం లేదని తేల్చిపారేసాడు.సో, ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చిత్రం ఆశించవచ్చు అన్నమాట.







