ఏ పండు ఏ సమయంలో తినాలో మీకు తెలుసా..?

అందరూ పండ్లు తినడానికి ఇష్టపడుతుంటారు కాకపోతే ఏ పండు ఏ సమయంలో తినాలో చాలామందికి తెలియదు.సాధారణంగా పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.

వాటిని తినడం వల్ల వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు.అలాగే పండ్ల నుంచి వివిధ రకాలైన ప్రోటీన్స్, ఫైబర్ మనం పొందవచ్చు.

సాధారణంగా పండ్లను చూడగానే మనకి తినాలనిపిస్తుంది.కాకపోతే పండ్లను తినడానికి కూడా ఒక సమయం ఉంటుంది.

కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఏ పండు ఎప్పుడు తినాలో తెలుసుకుందాం.

Advertisement

ఆపిల్..సాధారణంగా మనకి ఆరోగ్యం బాగా లేకపోతే మొదటగా గుర్తుకువచ్చే పండు ఆపిల్.

యాపిల్ తినడం వల్ల మనకు వ్యాధి నిరోధకశక్తి పెరుగుదలకు తోడ్పడుతుంది.పీచు పదార్థం ఎక్కువగా ఉండే వాటిలో యాపిల్ పండు కూడా ఒకటి.

అలాంటి ఈ పండ్లను ఉదయం మాత్రమే తినాలి.సాయంత్రం, రాత్రి వేళల్లో తింటే జీర్ణక్రియ అసౌకర్యంగా ఉంటుంది.

పుచ్చకాయ.నీరు అధిక శాతం కలిగి ఉన్న పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి.పుచ్చకాయని ఉదయం లేదా పగలు మాత్రమే తినాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాకినాడలో ప్లాంట్ .. రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కోరమాండల్ ఇంటర్నేషనల్

వేసవి కాలంలో వీటిని తినడం వల్ల వడదెబ్బ నుంచి రక్షిస్తుంది.రాత్రి సమయంలో దీనిని తినడం వల్ల యూరిన్ ఎక్కువగా వెళ్లే సమస్యలు ఉంటాయి.

Advertisement

అందువల్లన పగటి సమయంలో మాత్రమే దీనిని తీసుకోవడం మంచిది.

జామకాయ.జామకాయలో అధికంగా కాల్షియం కలిగి ఉంటుంది.డయాబెటిస్, రక్తపోటు అధికంగా ఉన్నవాళ్లు జామకాయను తీసుకోవడం మంచిది.

ఈ జామకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది.దీనిని అల్పాహారానికి ముందు తీసుకుంటే మంచిది.

తాజా వార్తలు