వారెవ్వా.. అద్భుతమైన టెక్నాలజీతో సరికొత్త వాషింగ్ మెషిన్..!

సాంకేతికత ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని పరికరాలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి.అందులోనూ ఈ మధ్యకాలంలో ప్రజల శ్రమను తగ్గించే పరికరాలు చాలానే మార్కెట్లోకి వచ్చాయి.

తాజాగా ఓ వాషింగ్ మెషిన్ కూడా అందుబాటులోకి వచ్చింది.ఇది ఆశామాసీ వాషింగ్ మెషిన్ కాదు.

ఇది అద్భుతమైన పరికరం అనే చెప్పాలి.వాషింగ్ మెషిన్లను చాలా కాలం నుంచి అనేక మంది వాడుతూ వస్తున్నారు.

దుస్తుల మురికిని శ్రమ లేకుండా వదలగొట్టేందుకు ఈ వాషింగ్ మెషిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి.అయితే తాజాగా అందుబాటులోకి వచ్చిన వాషింగ్ మెషిన్ అంతకు మించి పని చేస్తుంది.

Advertisement

ఈ వాషింగ్ మెషిన్ దుస్తులను శుభ్రపరిచేటప్పుడు అందులోనూ సింథటిక్ దుస్తులు ఉతికేటపుడు వాటిలోని మైక్రోప్లాస్టిక్స్ ను ఒడిసి పట్టుకుంటుంది.మైక్రో ప్లాస్టిక్స్ ను దుస్తుల నుంచి ఫిల్టర్ చేసి వేరుగా ఉంచుతుంది.

దుస్తులు ఉతకడం పూర్తయ్యాక సమీకరించిన మైక్రో ప్లాస్టిక్స్ ను కూడా ఇది వేరు చేస్తుంది.ఈ వాషింగ్ మెషిన్ వల్ల దుస్తుల్లోని మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు వేరుగా చేయొచ్చు.

వాషింగ్ మెషిన్ లో ఎలాంటి డిటర్జెంట్ పౌడర్ నైనా వాడుకోవచ్చు.

బ్రిటన్ లోని బ్రిస్టల్ కు చెందినటువంటి ఓ గల్ఫ్ కంపెనీ ఈ వాషింగ్ మెషిన్ ను తయారు చేసింది.దీని ధర 250 పౌండ్లుగా ఆ కంపెనీ నిర్ణయించింది.అంటే ఇది ఇండియా కరెన్సీలో రూ.24,513గా ఉంది.బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో ఈ వాషింగ్ మెషిన్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది.

పవన్ ప్రమాణ స్వీకారానికి లావణ్య త్రిపాఠి హాజరు కాకపోవడానికి కారణాలివేనా?
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

త్వరలోనే ప్రపంచ మంతా మార్కెట్లలోకి విడుదల కానుంది.నేటి సమాజంలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువవుతున్నాయి.

Advertisement

వీటి వల్ల మనుషులకు తెలియనటువంటి సమస్యలు వాటిల్లుతున్నాయి.ఇలాంటి సమయంలో ఇటువంటి వాషింగ్ మెషిన్లు రావడం నిజంగా మంచి విషయం.

తాజా వార్తలు