తమన్నా భాటియా(Tamannah Bhatia) అనిల్ రావిపూడి(Anil Ravipudi) మధ్య ఉన్న గొడవలు ఏంటి.అంత పెద్ద గొడవ ఉంటే వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలు ఎలా తెరకెక్కాయి అని ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
మరి ఇంతకీ అనిల్ రావిపూడి, తమన్నా మధ్య ఉన్న గొడవలు ఏంటి? ఎందుకు వీరి మధ్య ఆ గొడవ వచ్చింది అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.అనిల్ రావిపూడి ఈ మధ్యనే బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరి (Bhagavanth Kesari) అనే సినిమా తీసి హిట్టు కొట్టారు.
ఇక తమన్నా కూడా అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ లు అంటూ బిజీబిజీగా ఉంటుంది.
అయితే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా,మెహ్రీన్ హీరోయిన్లుగా వచ్చిన ఎఫ్2, ఎఫ్3(F3) సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కామెడీ, యాక్షన్, లవ్, ఎమోషన్స్ ఇలా అన్ని కలగలిపిన ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.అయితే తమన్నా అనిల్ రావిపూడి మధ్య అసలు గొడవ ఏంటి అనే సంగతి రీసెంట్ గా అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఓ ఇంటర్వ్యూలో ఆయన బయటపెట్టారు.
డైరెక్టర్ మాట్లాడుతూ.తమన్నాకు నాకు అంత పెద్ద గొడవ ఏం జరగలేదు.
ఓ రోజు చాలామంది ఆర్టిస్టులతో కలిసి ఒక సీన్ తెరకెక్కిస్తున్న సమయంలో తమన్నా (Tamannah) నా టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని అంది.ఇక మార్నింగ్ రమ్మంటే మార్నింగ్ నేను జిమ్ కి వెళ్ళాలి కుదరదు అని చెప్పింది.దాంతో మా ఇద్దరి మధ్య కాస్త మనస్పర్ధలు ఏర్పడ్డాయి.కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ మేము కలిసిపోయాం.ఇప్పుడు మా ఇద్దరి మధ్య అలాంటి గొడవలు ఏమీ లేవు అంటూ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.