వరంగల్ లో యువకుడి దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా..!

వరంగల్ లోని( Warangal ) హసన్ పర్తి మండలం మడిపల్లి కి చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తుమ్మల రాజు (30)( Tummala Raju ) దారుణ హత్యకు గురికావడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

వివరాల్లోకెళితే.తుమ్మల రాజును కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేసి ఆ మృతదేహాన్ని ఎస్సారెస్పీలో పడేశారు.

రాజు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా( BRS Social Media Incharge ) వ్యవహరిస్తున్నాడు.అయితే రాజుకు తన బాల్య స్నేహితురాలితో వివాహేతర సంబంధం ఉందని, పలుమార్లు ఈ విషయమై రాజును హెచ్చరించిన మార్పు రాకపోవడంతోనే హత్య జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

Warangal Brs Social Media Incharge Tummala Raju Murder Details, Warangal ,brs So

శనివారం ఉదయం రాజు పక్క గ్రామానికి చెందిన, తన పార్టీ నాయకుడితో కలిసి మద్యం సేవించినట్లు స్థానికులు చెబుతున్నారు.స్థానికుల సమాచారం ప్రకారం.మొదట ఎల్కతుర్తి లోని( Elkathurthy ) ఓ వైన్ షాప్ లో, ఆ తర్వాత జయగిరిలో ఉండే వైన్ షాపులో, చివరికి అన్నా సాగరంలోని ఓ స్మశాన వాటికలో రాజు మద్యం తాగినట్లు చూసిన వాళ్లు చెబుతున్నారు.

Advertisement
Warangal BRS Social Media Incharge Tummala Raju Murder Details, Warangal ,BRS So

రాజు మద్యం సేవించి ఆ యువతి ఇంటికి వెళ్లి నిందితులకు పట్టుబడ్డాడా.లేదంటే పథకం ప్రకారం హత్య చేసేందుకు రాజును ఫోన్ చేసి రప్పించారా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.

Warangal Brs Social Media Incharge Tummala Raju Murder Details, Warangal ,brs So

మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు రాజును ఇంటి వద్ద కట్టేసి, ఆటోలో తీసుకెళ్లి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.అయితే హత్య అనంతరం నిందితుడు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజు పట్టు పడ్డాడా.లేదంటే ఫోన్ చేసి రప్పించి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

వలసదారుల తరలింపు : యూఎస్ ఇమ్మిగ్రేషన్ సిబ్బందికి లై డిటెక్టర్ టెస్టులు , ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు