వార్ ఒన్ సైడ్ అయిపోయింది.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి.

ఈ క్రమంలోనే మునుగోడులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రచారం చేపట్టారు.

తాను గెలిస్తే ఆరు నెలల్లో మండలానికి ఒక కాలేజీ, ఉచిత ఆస్పత్రితో పాటు ప్రతి మండలానికి వెయ్యి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు.అంతేకాకుండా ఆరు నెలల్లోనే మునుగోడును అమెరికాను చేసి చూపిస్తానన్నారు.

ఇప్పటికే 60 శాతానికి పైగా ఓటర్లు తనవైపు వచ్చేశారని, మునుగోడు వార్ వన్ సైడ్ అయిపోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.తాము ఇంకా కొంచెం కష్టపడితే ప్రధాన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లకు డిపాజిట్లు కూడా దక్కవని ధీమా వ్యక్తం చేశారు.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
Advertisement

తాజా వార్తలు