నాన్న చనిపోయాక తిండి లేక అలా చేశా.. ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు కామెంట్స్ వైరల్!

ప్రముఖ నటుడు ఐరన్ లెగ్ శాస్త్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఐరన్ లెగ్ శాస్త్రి చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

 Iron Leg Sastry Comments Goes Viral In Social Media Details Here Goes Viral , P-TeluguStop.com

ఒక ఇంటర్వ్యూలో ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు మాట్లాడుతూ నాన్న ఇంట్లో సినిమా గురించి మట్లాడటానికి ఇష్టపడేవారు కాదని అన్నారు.

నాన్నగారు దాదాపు 200 సినిమాలలో నటించారని 30 40 సీరియళ్లలో నటించారని ఆయన కొడుకు ప్రసాద్ పేర్కొన్నారు.జీవితం అనేది దేవుడి రాత అని ఆ రాత ప్రకారం జరుగుతుందని ప్రసాద్ కామెంట్లు చేశారు.

నాన్నగారు ఊరికి వచ్చారంటే ఆ సందడి వేరే లెవెల్ లో ఉండేదని ఆయన పేర్కొన్నారు.జంధ్యాల, ఇ.వి.వి.సత్యనారాయణ గారు కమెడియన్లకు అవకాశాలు ఇచ్చారని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Iron Leg Sastry, Jandhyala, Kadambari Kiran, Prasad, Tollywod, Troubles-M

నేను కార్పొరేట్ స్కూల్ లో చదివానని నాన్న చనిపోయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ కు మూవ్ కావాల్సి వచ్చిందని ఆ సమయంలో ఫీజు చెల్లించడానికి కూడా డబ్బులు లేవని ఐరన్ లెగ్ శాస్త్రి కొడుకు చెప్పుకొచ్చారు.నాన్న మరణం తర్వాత లైఫ్ మారిపోయిందని కిలో బియ్యం తీసుకుని వారం రోజులు తిన్న సందర్భాలు ఉన్నాయని నేను గంజి తాగానని ప్రసాద్ కామెంట్లు చేశారు.నాన్న చనిపోయిన సమయంలో నా వయస్సు 13 సంవత్సరాలు అని ప్రసాద్ పేర్కొన్నారు.

నాన్న చనిపోయిన తర్వాత రిలేటివ్స్ నుంచి కూడా ప్రెజర్ ఉండేదని ప్రసాద్ అన్నారు.చదువు విషయంలో కాదంబరి కిరణ్, సంపూర్ణేష్ బాబు హెల్ప్ చేశారని ఆయన తెలిపారు.

ప్రసాద్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ సంతోషంగా జీవనం సాగిస్తున్నానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube