సాధారణంగా వాహనాలపై స్టంట్స్ చేయడం చాలా ప్రమాదకరం.రిస్కీ స్టంట్స్ చేస్తున్నప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది.
అయినా కూడా థ్రిల్ కోసం కొందరు యువకులు వీటిని ట్రై చేస్తుంటారు.కాగా ఇటీవల కూడా నలుగురు యువకులు ఒక కారుతో హై స్పీడ్‌లో డ్రిఫ్ట్ స్టంట్ చేశారు.
ఈ క్రమంలో కారు డోర్ కు వేలాడుతున్న ఒక యువకుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు.దాంతో అతడి పైనుంచి కారు వెళ్లింది.
కాగా ఈ యువకుడికి ప్రాణాపాయం తప్పింది కానీ గాయాలైనట్లు తెలుస్తోంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
@bornAkang అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక పార్కింగ్ గ్రౌండ్‌లో ఒక కారు ఉండడం చూడవచ్చు.ఈ కారు పక్కన సైడ్‌లో ఇద్దరు వ్యక్తులు బయటకు వేలాడుతూ కనిపించారు.మరో సైడ్ ఒక వ్యక్తి కారు కిటికీ లోపల నుంచి బయటికి వచ్చాడు.
ఆ తర్వాత డ్రైవర్ కారును చాలా స్పీడ్ గా ముందుకు వెనక్కు పోనిచ్చాడు.అయితే కారు చాలా వేగంగా కదలడంతో కారు విండోకు వేలాడుతున్న ఒక వ్యక్తి కింద పడిపోయాడు.
అనంతరం అతని మెడ పైనుంచి కారు టైర్ ఎక్కి వెళ్ళింది.ఆ సమయంలో అతడి మెడ కాస్త ట్విస్ట్ అయినట్లు కనిపించింది.అయినా కూడా అతడు బాగానే లేసి పరిగెత్తుకుంటూ పక్కకు వెళ్లిపోయాడు.దీన్ని చూసిన డ్రైవర్ ‘హమ్మయ్య అతడు బతికే ఉన్నాడ’ని ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది.
అతని అదృష్టం వల్ల మెడ ఇరిగిపోలేదు.ఒకవేళ అదే జరిగితే అతని ప్రాణాలే పోయిండేవి.
ఇలాంటి పిచ్చి స్టంట్స్ చేయకూడదని నెటిజన్లు చాలా మందికి సూచిస్తున్నారు.ఈ వీడియో పై మీరు కూడా లుక్కేయండి.