ఒక్కోసారి కుక్కలు నోట కరచుకొని తీసుకొచ్చేవి చూస్తే మన గుండె జారిపోతుంది.ముఖ్యంగా కొన్ని కుక్కలు మనిషి తలను కూడా ఎత్తుకొస్తుంటాయి.
నిజంగా అవి చంపేసి మనిషి తలను పీక్కొని వస్తున్నాయా? లేక ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగి తల ఊడిపోతే దానిని మోసుకొస్తున్నాయా? అనే విషయం పక్కన పెడితే.వీధిలో ఇవి మనిషి తల పట్టుకుని తిరగడం చూస్తే హడలి పోక తప్పదు.
కాగా అలా భయం పుట్టించే ఒక షాకింగ్ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఓ కుక్క తెగిన మనిషి తలతో వీధిలో తిరుగుతూ కనిపించింది.“మనిషి తలతో వీధిలో తిరుగుతున్న కుక్క” అనే క్యాప్షన్‌తో @హ్యూమన్ గ్రైండ్ (@SuperHuemon) ట్విట్టర్ పేజీ ఈ వీడియోను షేర్ చేసింది.అక్టోబరు 28న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే 15 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
వీడియోలో ఒక కారు ఒక మూలకు తిరగడం కనిపించింది.కాసేపటికి, ఒక కుక్క రోడ్డుకు పక్కగా పరుగెత్తడం కనిపించింది.ఆ కుక్క దవడలలో ఒక వ్యక్తి కనిపించింది.అది తెగి పడిన తలతో రోడ్లపై తిరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
ఆ ట్వీట్‌లో పేర్కొన్న హ్యాష్‌ట్యాగ్‌లలో ఒకటి మెక్సికోలో ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించింది.

ఈ వీడియో చూసి నెటిజన్లు బాగా షాక్ అవుతున్నారు.బహుశా ఈ తల హలోవిన్ సందర్భంగా ఎవరో తయారు చేసి ఉంటారు.దాన్ని కుక్క ఎత్తుకొచ్చిందేమో అని ఇంకొక వ్యక్తి అన్నాడు.
అయితే ఇది మెక్సికో కాబట్టి అక్కడ క్రైమ్స్ అధికంగా ఉంటాయి కావున ఇది నిజమే కావచ్చని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.ఏది ఏమైనా ఈ వీడియో చూస్తుంటే గుండెల్లో భయాన్ని రేకెత్తిస్తోంది.
ఈ వీడియో పై మీరు కూడా లుక్కేయండి.







