అమెరికాలో లెక్కకు మించిన తెలుగు సంఘాలు ఎన్నో ఉన్నాయి.ప్రాంతాలకు తగ్గట్టుగా తెలుగు ఎన్నారైలు ఎన్ని సంఘాలు ఏర్పాటు చేసుకున్నా సరే అందరి ఆలోచన ఒక్కటే అమెరికాలో ఉండే సాటి తెలుగు కుటుంబాలకు, విద్యార్ధులకు, తోడుగా ఉండటం, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకోవడం, తెలుగు బాష, సంస్కృతీ, సాంప్రదాయాలను భావి తరాలకు అందించడం.
ఈ మోటోతోనే అన్ని సంఘాలు పనిచేస్తుంటాయి.ఈ కోవకు చెందినదే నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్.
తాజాగా ఈ సంఘం అమెరికాలో రికార్డ్ క్రియేట్ చేసింది.

విరాళాల సేకరణలో ఇప్పటి వరకూ ఏ తెలుగు సంస్థ సేకరించని విధంగా విరాళాలు సేకరించి చరిత్ర సృష్టించింది.వివరాలలోకి వెళ్తే.నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) బోర్డు సమావేశం తాజాగా అమెరికాలోని డాలస్ లో జరిగింది.
ఈ సమావేశానికి నాటా సభ్యులు, స్థానికంగా ఉన్న తెలుగు వారందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.సుమారు 700 మంది ఈ సమావేశానికి పాల్గొన్నట్టుగా నాటా సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అందరూ పాల్గొన్నారు.ఈ సమావేశం లో డాలస్ లో జరగబోయే నాటా కన్వేషన్ గురించి చర్చించారు.
కన్వేషన్ జరిగే ప్రదేశాన్ని సందర్శించి అక్కడి వసతులను పరిశీలించారు.దాదాపు 15 వేలకు పైగానే ఈ కన్వేషన్ కు హాజరవుతారని నాటా అధ్యక్షులు కొర్సాపాటి శ్రీధర్ రెడ్డి తెలిపారు .ఇదిలాఉంటే సమావేశం అనంతరం సాయంత్రం సమయంలో ఏర్పాటు చేసిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో 700 మంది పాల్గొన్నారు.ఈ క్రమంలో నిధుల సేకరణ చేపట్టగా మొత్తం 26,000,00 లక్షల డాలర్ల నిధుల హామీ సభ్యుల నుంచీ వచ్చిందని అధ్యక్షులు ప్రకటించారు.
కాగా ఈ స్థాయిలో ని







