వాట్సాప్ లో బ్యాక్ గ్రౌండ్ మార్చాలి అనుకుంటున్నారా..? అయితే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరి..!

వాట్సాప్ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫీచర్ తో ముందుకొస్తోంది.ఇంకా అనేక కస్టమైజేషన్ ఆప్షన్స్ కల్పిస్తుంది.

దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన విధంగా వాట్సాప్ ను ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుంది.ఇప్పుడు వాట్సాప్ వినియోగదారులు తమ వాట్సాప్ బ్యాక్గ్రౌండ్ మార్చుకునే ఫీచర్ తో ముందుకు వచ్చింది.

అయితే ఈ వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ ను ఎలా మార్చుకోవాలో ఓ లుక్కేద్దాం.వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ లో వినియోగదారులు తమకు నచ్చిన వాల్ పేపర్లను బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకునే అవకాశం కల్పిస్తుంది.

దీనికోసం ముందుగానే వాట్సాప్ లో సాలిడ్ కలర్స్ తో కూడిన ప్రీ లోడెడ్ వాల్ పేపర్స్ ఉంటాయి.ఇది మాత్రమే కాకుండా యూజర్లు తాము క్లిక్ చేసిన ఫోటోలు కూడా వాల్ పేపర్ గా చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

కేవలం కొన్ని క్లిక్ తో వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ మారిపోతుంది.వాట్సాప్ లో మరో ఇంటరెస్టింగ్ ఫీచర్ ఏంటంటే.

వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ మాత్రమే కాకుండా ప్రతి చాట్ కి కూడా వేర్వేరుగా బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు.ఇందులో లైట్ మోడ్, డార్క్ మోడ్ లో కూడా వాల్ పేపర్లు మార్చుకోవచ్చు.

అయితే ఇప్పుడు వాట్సాప్ లో చాట్స్ కి బ్యాక్ గ్రౌండ్ ఎలా మార్చుకోవాలో చూద్దాం.

ముందుగా వాట్సాప్ ని ఓపెన్ చేయాలి.తర్వాత వాట్సాప్ కి పైన కుడి వైపు ఉన్న త్రీ డాట్స్ ను క్లిక్ చేసి సెట్టింగ్స్ అనే ఆప్షన్ను ఓపెన్ చేయండి.అందులో చార్ట్స్ సెలెక్ట్ చేసుకోండి.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
వైరల్ వీడియో : వాటే ఐడియా.. కరెంట్ లేకుండా ఐరన్ ఎంత సింపుల్ గా చేస్తున్నాడో కదా..

ఆ తర్వాత వాల్ పేపర్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన వాల్ పేపర్ ను సెలెక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు Change ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Advertisement

అందులో Bright, Dark, Solid Colors, My Photos అనే ఆప్షన్స్ కనిపిస్తాయి.మీరు కోరుకునే ఆప్షన్ను సెలెక్ట్ చేసి వాల్ పేపర్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత Wallpaper Preview పైన క్లిక్ చేయాలి.వాల్ పేపర్ మారిస్తే ఎలా కనిపిస్తుందో ఇప్పుడు రివ్యూ లో తెలుస్తుంది.

ఇప్పుడు Set Wallpaper పైన క్లిక్ చేస్తే వాల్ పేపర్ అవుతుంది.ఒకవేళ డిఫాల్ట్ వాల్పేపర్ సెట్ చేయాలంటే.

ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి, కుడివైపు ఉన్న త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి.అందులో సెట్టింగ్స్ ఆప్షన్ ను ఎంచుకొని చాట్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి.

ఆ తర్వాత వాల్ పేపర్ ను సెలెక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు కింద ఉన్న Default Wallpaper పైన క్లిక్ చేస్తే డిఫాల్ట్ వాల్పేపర్ సెట్ అవుతుంది.

తాజా వార్తలు