AP Assembly : అసెంబ్లీ నుంచి ఏపీ టీడీపీ సభ్యుల వాకౌట్

ఏపీ అసెంబ్లీ( AP Assembly ) సమావేశాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్( Governor Abdul Nazeer ) ప్రసంగిస్తున్నారు.

ఓ వైపు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్( TDP Members Walkout ) చేశారు.గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉందని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.

గవర్నర్ వెళ్లే దారిలో బైఠాయించే ప్రయత్నం చేయడంతో టీడీపీ సభ్యులను మార్షల్స్ అడ్డుకున్నారు.దీంతో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారు.కాగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల ముందు జరుగుతున్న చివరి అసెంబ్లీ సమావేశాలు కాగా రేపు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్( Minister Buggana Rajendranath ) ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు