నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన చీరాలలో చోటు చేసుకుంది.కాగా ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
ఇక ఈ సంఘటన వివరాలు తెలుసుకుంటే.
చీరాలలోని రైల్వే ఫ్లైఓవర్ బిడ్జ్పై ఓ కారు సృష్టించిన బీభత్సంలో అతివేగం ముఖ్య కారణంగా తెలుస్తుందట.
వేగంగా వస్తున్న కారు కంట్రోల్ కోల్పోయి బిడ్జ్పై నుండి వెళ్లుతున్న మూడు బైక్‌లను ఢీకొట్టిందట.కాగా ఈ ప్రమాదంలో వీఆర్వోగా పని చేస్తున్న అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయట.
ఈమేరకు ప్రమాద ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.కాగా ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లుగా వెల్లడించారట.
చూశారా మనిషి నిర్లక్ష్యం వల్ల బలైన ప్రాణాలను తిరిగి తీసుకు వస్తామా.ఎవరో చేసిన తప్పుకు ఓ కుటుంబం అనాధగా మారింది.ఈ విషయంలో మనుషుల్లో మార్పు ఎందుకు వస్తలేదో అసలే అర్ధం అవడం లేదు.
వేగం అనేది ఎంత ప్రమాదకరమో ఒక్క సారి ఆలోచించి ఆ ఘటనలో మిమ్మల్ని, మీకుటుంబాన్ని ఊహించుకోండి.
కాస్త ఆలోచించి నడుచుకోండని రోడ్డు ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారి ఆక్రందనట.