గోవుల సేవలో బిజీ అయిన యాంకర్ విష్ణుప్రియ.. వాళ్లంతా మిత్రులంటూ?

బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నా స్టార్ యాంకర్ స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోయారనే సంగతి తెలిసిందే.

గతంలో కొన్ని షోలతో బిజీగా ఉన్న విష్ణుప్రియకు ఈ మధ్య కాలంలో ఆఫర్లు సైతం తగ్గాయి.

అయితే సోషల్ మీడియాలో మాత్రం విష్ణుప్రియ యాక్టివ్ గానే ఉన్నారు.విష్ణుప్రియ నటించిన చెక్ మేట్ సినిమా రిలీజ్ కావాల్సి ఉందనే సంగతి తెలిసిందే.

తాజాగా విష్ణుప్రియ గోశాలలో సందడి చేయడంతో పాటు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఆవులతో పాటు లేగదూడలకు సేవ చేస్తూ కనిపించిన విష్ణుప్రియ ఆవులకు, లేగదూడలకు మేత వేస్తూ సరదాగా సందడి చేశారు.

తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఆవులను ఫ్రెండ్స్ లా భావిస్తానని ఆవులంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె అన్నారు.విష్ణుప్రియ ఆవులతో కలిసి దిగిన ఫోటోలను నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.

Advertisement

విష్ణుప్రియ గోవులకు చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.బుల్లితెరపై పద్ధతిగా కనిపించే విష్ణుప్రియ సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.సినిమాల్లో మంచి ఆఫర్ వస్తే గ్లామర్ షోకు కూడా సిద్ధమేనని విష్ణుప్రియ చెప్పకనే చెబుతున్నారు.

మరోవైపు టీవీ షోలతో పాటు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ విష్ణుప్రియ బుల్లితెరపై సందడి చేస్తున్నారు.

గోవులంతా మిత్రులంటూ విష్ణుప్రియ చెప్పిన మాటలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.విష్ణుప్రియ యాంకర్ గా మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.విష్ణుప్రియ యాంకర్ గా కూడా వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

విష్ణుప్రియ కెరీర్ కు చక్కగా ప్లాన్ చేసుకుని ఇకపై వరుస ఆఫర్లతో బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.చెక్ మేట్ మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు