విశాఖలో టీడీపీకి ఊహించని దెబ్బ... వైసీపీ గూటికి నగర అధ్యక్షుడు

ఏపీలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతూ సాగుతున్నాయి.ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ వేస్తున్న రాజీయ వ్యూహాల ముందు టీడీపీ తేలిపోతుంది.

వరుసగా అధికార పార్టీ కొడుతున్న దెబ్బలకి చంద్రబాబు ఎటు మాట్లాడలేక ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితిలో కొట్టుకుంటున్నారు.ప్రస్తుతం రాజధాని విషయంలో కూడా టీడీపీ పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

అమరావతి ప్రాంతం నాయకులు రాజధానికి అమరావతినే కొనసాగించాలని అంటూ ఉంటే విశాఖ జిల్లాకి మెజారిటీ నేతలు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికార పార్టీని కోరుతున్నారు.ఈ నేపధ్యంలో అధినేత చంద్రబాబు ఎటు తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే టీడీపీ తరుపున గెలిచినా విశాఖ నేతలందరూ రాజధాని విషయంలో చంద్రబాబుపై దిక్కార స్వరం వినిపిస్తూ ఉండగా తాజాగా ఆ పార్టీ నగర అధ్యక్షుడు రెహమాన్ పార్టీకి ఏకంగా రాజీనామా చేశారు.ఇప్పటికే తనకి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడంపై అసంతృప్తితో ఉన్న రెహమాన్ తాజాగా జగన్ విశాఖని రాజధానిగా చేస్తాననే నిర్ణయం ప్రకటించడంతో ఇదే మంచి అవకాశం అని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.

Advertisement

విశాఖ ఉత్సవ లో పాల్గొనడానికి నగరానికి వస్తున్నా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరుతారని టాక్ వినిపిస్తుంది.ఇక ఎమ్మెల్యేలు కూడా జగన్ కి మద్దతు ఇస్తున్న నేపధ్యంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఇప్పుడు చంద్రబాబు టెన్షన్ లో ఉన్నారు.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు