పుకార్లు నమ్మొద్దు.. కాశ్మీరీలకు ఎప్పటిలాగే వీసాలు: పాకిస్తాన్

జమ్మూకాశ్మీర్ నివాసితులకు పాకిస్తాన్ అనుసరించే విధానంలో ఎలాంటి మార్పు లేదని ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం వీసాలు జారీ చేస్తూనే ఉంటుందని, ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని పాకిస్తాన్ హైకమీషన్ జమ్మూకాశ్మీర్ ప్రజలకు క్లారిటీ ఇచ్చింది.

జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత నుంచి ఢిల్లీలోనీ పాక్ హైకమిషన్ జమ్మూకాశ్మీర్ ప్రజల వీసా దరఖాస్తులను పరిశీలించేటప్పుడు.

ఈ ప్రాంత పరిస్దితులను సైతం పరిగణనలోనికి తీసుకుంటోందని పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది.

కాగా.ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.పాకిస్తాన్.

Advertisement

భారతదేశంతో దౌత్య సంబంధాలను తగ్గించుకోవడంతో పాటు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌ను సైతం బహిష్కరించిన సంగతి తెలిసిందే.

జాక్ పాట్ కొట్టిన మేస్త్రి.. నెలకు కోటి చొప్పున 30 ఏళ్ల వరకు..

Advertisement

తాజా వార్తలు