ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టాప్ 10 బెస్ట్ బ్యాటర్స్‌లో కోహ్లీ ఒకడని నిస్సందేహంగా చెప్పొచ్చు.ఈ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంతో మంది దిగ్గజ ప్లేయర్లు నెలకొల్పిన రికార్డులను కూడా అవలీలగా బ్రేక్ చేశాడు.
మొన్నటిదాకా ఫామ్ లో లేకపోయినా ఆసియా కప్ నుంచి ఫుల్ ఫామ్‌లోకి వచ్చి అదరగొడుతున్నాడు.వరల్డ్ కప్‌లోనూ టాప్ స్కోరర్ గా నిలిచి అభిమానుల చేత కోహ్లీ ఇజ్ బ్యాక్ అని అనిపించుకున్నాడు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన ఒక మ్యాచ్ లో 100 స్కోర్ చేసి తన పని ఇంకా అయిపోలేదని చెప్పకనే చెప్పాడు.
అయితే ఈ నేపథ్యంలోనే అతడి పేరు మీద సరికొత్త రికార్డు నమోదయింది.
బంగ్లాదేశ్ గడ్డపై వన్డే ఫార్మాట్‌లో 1,000 పరుగులు పూర్తి చేసిన ఫస్ట్ ఇండియన్ క్రికెటర్‌గా కోహ్లీ ఓ ప్రత్యేక రికార్డు సృష్టించాడు.అంతేకాదు విదేశీ గడ్డపై అతి తక్కువ మ్యాచ్‌లలో వన్డే ఫార్మాట్‌లో 1000 రన్స్ చేసిన ప్లేయర్‌గా కూడా కోహ్లీ ఒక రికార్డును సృష్టించాడు.
విరాట్ 2019, ఆగస్టు 14 తర్వాత డిసెంబర్ 10న ముందుగా బంగ్లాదేశ్‌తో జరిగిన చటోగ్రామ్ వన్డే మ్యాచ్‌లో తన మొదటి వన్డే సెంచరీని నమోదు చేశాడు.ఈ సెంచరీతో వన్డే ఇన్నింగ్స్‌లో స్కోర్‌కార్డ్‌లో తన పేరు పక్కన మూడు అంకెల స్కోరును చూడాలనుకునే కోహ్లీ మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది.

భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ లిట్టన్ దాస్ బౌలింగ్ ఎంచుకున్నాడు.విరాట్ కోహ్లీ మిడిల్ ఆర్డర్‌లో సెటిల్ అయ్యేందుకు కొంత సమయం తీసుకున్నాడు.బాగా కుదురుకున్నాక కోహ్లీ 91 బంతుల్లో 113 పరుగులు చేశాడు.దీంతో బంగ్లాదేశ్‌పై మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.
భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ గతంలో 1,316 పరుగులతో ఈ రికార్డును తన పేరున ఉంచుకున్నాడు.కాగా ఇప్పుడు కోహ్లీ బంగ్లాదేశ్‌పై 25 ఇన్నింగ్స్‌లలో 1,392 పరుగులు చేసి ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ 25 ఇన్నింగ్స్‌లలో అతని బ్యాటింగ్ సగటు 73.26.