సెకండ్ ఇన్నింగ్స్ ఫెయిల్యూర్ దిగ్గజ దర్శకులు వీళ్ళే !

టాలీవుడ్ ఇండస్ట్రీ ఒక లవ్ స్టోరీలకు మరియు యాక్షన్ చిత్రాలకు మాత్రమే పరిమితం కాదు.కన్నీళ్లు పెట్టించే ఎన్నో సెంటిమెంటల్ సినిమాలకు కూడా పెట్టింది పేరు.అందుకే ఉదాహరణ చెప్పాలంటే దర్శక దిగ్గజాలైన దాసరి, కృష్ణ వంశి మరియు ఎస్వీ కృష్ణ రెడ్డి వంటి వారి గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి.

 Failure Tollywood Directors Second Innings Dasari Sv Krishna Reddy Krishnavamsi-TeluguStop.com

దాసరి నారాయణరావు :

Telugu Dasari Yana Rao, Krishna Vamsi, Puri Jagannath, Srinu Vaitla, Vv Vinayak,

కేవలం దర్శకత్వం మాత్రమే కాకుండా కథ, పాటలు, మాటలు కూడా అందించిన వ్యక్తి దాసరి.రాఘవేంద్ర రావు వంటి దర్శకుడితో తీవ్రమైన పోటీ ఉండేది.కళ్ళకు ఎంతో విందుగా ఉండే సినిమాలు అయన తీస్తే దాసరి మాత్రం మాటల్తో తూటాలు పేల్చేవారు .అందుకు క్లాసిక్ ఉదాహరణలు చెప్పాలంటే అమ్మ రాజీనామా, సర్దార్ పాపారాయుడు వంటివి ఉంటాయి.అయితే అయన చివరి దశలో ఎన్నో ఫ్లాప్ చిత్రాలను తీశారు ఎర్ర బస్సు వంటి చప్పిడి సినిమాను సెకండ్ ఇన్నింగ్స్ లో తీసి అభిమానులను నిరాశ పరిచారు.

SV కృష్ణ రెడ్డి :

Telugu Dasari Yana Rao, Krishna Vamsi, Puri Jagannath, Srinu Vaitla, Vv Vinayak,

మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే ప్రేమను, బంధాలను తెరపైన చూపించి ప్రేక్షుకుడి హృదయాన్ని కదిలించడం లో కృష్ణ రెడ్డి దిట్ట.అయన సినిమాలో మంచి నాణ్యమైన హాస్యం ఉంటుంది.మంచి సంగీతం, పాటలు ఆయను శిఖరాగ్రాన నిలబెట్టాయి.అయితే ,మధ్యలో కొంత యావేరేజ్ సినిమాలు కూడా తీశారు.ఆ తర్వాత విరామం తీసుకొని యమలీల 2 అంటూ సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చారు.అది సగటు కృష్ణ రెడ్డి అభిమానులను నిరాశ పరిచింది.ఇక ఇప్పుడు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అంటూ వస్తున్న ట్రైలర్ చూసాక అయన మార్కు ఎక్కడ కనిపించక నాసిరకంగా వచింది.

కృష్ణవంశీ

Telugu Dasari Yana Rao, Krishna Vamsi, Puri Jagannath, Srinu Vaitla, Vv Vinayak,

రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఈయనది ఒక భిన్నమైన పంథా.సహజమైన కథలతో, భిన్నమైన ఆలోచనలతో, కృష్ణ వంశి సినిమాలు తీస్తాడు.అయన తీసిన షింధురం, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, మురారి వంటి చిత్రాలు దేనికదే ఒక భిన్నమైనవి.

ఇన్ని మంచి చిత్రాలు తీసిన అయన పైసా , గోవిందుడు అందరివాడు, నక్షత్రం వంటి చిత్రాలు చూసాక ఆయనను మాత్రమే నమ్మి వెళ్లి థియేటర్ లో సినిమా చూసాక నిరాశ మాత్రమే ఉంటుంది.

వీళ్ళు మాత్రమే కాదు పూరి జగన్నాథ్ , శ్రీను వైట్ల , వై వి ఎస్ చౌదరి, వి వి వినాయక్ , బొమ్మరిల్లు భాస్కర్ వంటి చాల కొత్త మరియు పాత దర్శకులు ఉన్నారు.

వీరంతా వారి వారి మార్కు సినిమా తెస్తే తప్పకుండ హిట్ అవుతారు.ఆ దిశగా ఆలోచించండి ప్లీజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube