వైరల్ వీడియో: తినేటప్పుడు కూడా ఫోన్ వదలని భర్త.. దాంతో భార్య ఏం చేసిందంటే..?!

ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది మ‌నందిరి జీవితాల్లో నిత్య భాగం అయిపోయింది.

లేచిన ద‌గ్గ‌రి నుంచి రాత్రి మ‌ళ్లీ ప‌డుకునే వ‌ర‌కు ఒక్క ప‌ది నిముషాలు కూడా ఫోన్ లేకుండా ఉండ‌లేక‌పోతున్నాం.

మ‌నుషుల‌తో కంటే ఫోన్‌లోనే ఎక్కువ‌గా గ‌డిపేస్తున్నాం.అంత‌లా స్మార్ట్ ఫోన్లు మ‌న‌ల్ని క‌ట్టి ప‌డేశాయి.

న‌డుస్తున్నా, కూర్చున్నా, ఫంక్ష‌న్లో ఉన్నా, పార్టీలో ఉన్నా.ఆఖ‌ర‌కు హాస్పిట‌ల్ బెడ్‌మీద ఉన్నా కూడా మ‌న‌కు ఫోన్ లేకపోతే టైమ్ పాస్ కాదు.

ఇంకా చెప్పాలంటే ఓ పూట అన్న‌మైనా మానేస్తామేమో గానీ ఫోన్‌ను మాత్రం ప‌క్క‌న పెట్టం.అయితే అతిగా మొబైల్‌ వాడుతున్న ఓ వ్యక్తికి అతడి భార్య ఊహించని షాక్‌ ఇచ్చింది.

Advertisement

ఇదిగో ఈ కింది వీడియోలో వ్యక్తిని చూశారుగా.తిండి తింటూనే సెల్‌ఫోన్ వీక్షిస్తున్నాడు.

తినటం కంటే.మొబైల్‌ పైనే ఎక్కువ శ్రద్ద పెట్టాడు.

అది చూస్తున్న‌ అతడి భార్యకు విప‌రీత‌మైన కోపం వ‌చ్చింది.ఏం చేయాల‌ని ఆలోచించింది.

వెంటనే ఓ ప్లాస్టర్‌ తీసుకొచ్చింది.అతడి ముఖానికి మొబైల్‌ఫోన్‌కి కలిసి బ్యాండెడ్ లాగా టైట్‌గా వేసేసింది.

అదుర్స్ 2 ఆ కారణం చేతే చెయ్యలేదు...ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్! 
చనిపోయిన భార్యకు కర్మకాండ నిర్వహించిన భర్త.. కానీ, భర్త ముందు ప్రత్యక్షమైన భార్య.. అసలు ఏమైందంటే?

దీంతో అత‌ను ఒక్క‌సారిగా షాక్ తిన్నాడు.వెంట‌నే తేరుకుని బ్యాండేడ్ తీయ‌మ‌ని భార్య‌ను అడ‌గ్గా ఆమె తీసేసేసింది.

Advertisement

అంటే తినే ట‌ప్పుడు కూడా ఫోన్ చూస్తుంటు ఎంత తింటున్నామో, ఏం తింటున్నామో కూడా తెలియ‌కుండా పోతుంద‌ని ఆమెఉద్ధేశ్యం.కాబట్టి అలా చేసి ఉంటుంది.

కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది.ఎంతైనా స్మార్ట్ ఫోన్ తో వచ్చిన స‌మ‌స్య‌లు ఇలాగే ఉంటున్నాయి.

దాన్నే మ‌న లోకంగా భావిస్తూ అందులోనే మ‌న టైమ్ అంతా గడుపుతుంటాం.కొన్ని సార్లు చూస్తుంటే మ‌నం నలుగురిలో ఉన్నా, ఇంట్లో భార్యా పిల్లలతో ఉన్నా ఆఖ‌ర‌కు బంధువుల ఇంటికి వెళ్లినా ఇదే స‌మ‌స్య‌.

ఫోన్ లేకుండా ఉండ‌లేం.మ‌నం ఎక్కడున్నా స‌రే ఫోన్ పై మ‌న చేతి వేళ్లు కదులుతూనే ఉండాలి.

లేక‌పోతే మ‌న‌కు టైమ్‌పాస్‌ కాదు.అందుకే ఫోన్ ను ప‌క్క‌న పెడుదాం.

తాజా వార్తలు