వైరల్ వీడియో: అసలు ఎవరయ్యా ఈమెను ఆ పోటీలకు పంపించింది..!

ఆటల పోటీల్లో ఒక్కొక్కసారి ప్లేయర్లు చేసే పనులు ఆసక్తికరంగా మారాయి.ఇక క్రీడాకారుల రికార్డులు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

కొంతమంది రికార్డులు అధిగమించి చరిత్ర సృష్టిస్తే.మరికొంతమంది చెత్త రికార్డులను కూడా నమోదు చేస్తారు.అయితే తాజాగా ఓ అథ్లెటిక్ వింత ప్రవర్తన హాట్‌టాపిక్‌గా మారింది.100 మీటర్ల రన్నింగ్ రేసులో ఓ అథ్లెట్ వింత ప్రవర్తన వల్ల పరువు తీసింది.ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.

చైనాలో చెంగ్ఢూలో ( Chengdu, China )31వ సమ్మర్ వరల్డ్ యూనివర్సిటీ ఆటలు ఇటీవల నిర్వహించారు.ఈ సందర్బంగా 100 మీటర్ల విభాగంలో పరుగు పందెం నిర్వహించారు.ఈ పందెంలో సోమాలియాకు చెందిన అథ్లెట్ అబుకర్ అలీ( Abukar Ali ) పాల్గొంది.

పరుగు పందెం స్టార్ట్ చేసే సమయంలో మిగతా అథ్లెట్లు స్టాన్స్ కు పొజిషన్ ఇవ్వగా.అబుకర్ అలీ కనీసం స్టాన్స్ పొజిషన్ ఇవ్వడానికి కూడా బద్దకించింది.రేసింగ్ మొదలు కాగానే అందరూ స్పీడ్ గా పరిగెత్తుతుండగా.ఈమె మాత్రం నెమ్మదిగా పరిగెడుతూ ఉంది.100 మీటర్ల రేసు పూర్తిగా సోయడానికి అబుకర్ అలీకి 21 సెకన్లు పట్టింది.అలాగే పరుగు పందెం పూర్తయిన తర్వాత ట్రాక్ పై జంప్ చేస్తూ వెళ్లింది.

Advertisement

అబుకర్ అలీకి సంబంధించి వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.దీంతో ఆమెపై నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.ఆమెను పోటీలకు పంపించినందుకు సోమాలియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ( Somalia Ministry of Youth and Sports )పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనీస అవగాహన లేని వ్యక్తిని ఎలా పోటీలకు పంపారని ప్రశ్నిస్తున్నారు.దేశం తరపున ఆమెను బరిలోకి దింపి పరువు తీసుకున్నారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.మీ దేశం పరువును మీరే తీసుకుంటున్నారని అంటున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో అబుకర్ అలీ చిన్నపిల్లలా పరిగెత్తడం, జంప్ చేయడం చూసి కొంతమంది నవ్వుకుంటున్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు