వైరల్ వీడియో... డ్యాన్స్ స్టెప్పులతో అదరగొట్టిన నటి ప్రగతి

ఒకప్పుడు సినిమా నటులకు అవకాశం దొరకాలంటే చాలా కష్టం.అంతేకాక నటులు పాపులర్ కావడానికి సినిమా ఒక్కటే వేదిక.

కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు.చాలా మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి.

అందుకే ఇప్పుడు నటులు తెర మీది కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటున్నారు.ఇలా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న నటులలో ముందు వరుసలో ఉంటారు నటి ప్రగతి.

నటి ప్రగతి తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు.చాలా స్టార్ హీరోల సినిమాలలో సహాయ నటిగా అలరించిన విషయం తెలిసిందే.

Advertisement

ఇప్పుడు కోవిడ్ సమయంలో చాలా సినిమాలు రిలీజ్ కు నోచుకోక పోవడంతో తెర మీద కనిపించేందుకు అవకాశం లభించలేదు.కాని నటి ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం రకరకాలుగా అభిమానులతో టచ్ లో ఉంటోంది.

తాజాగా డ్యాన్స్ డే సందర్బంగా తన స్నేహితురాలితో కలిసి స్టెప్పులతో అదరగొట్టింది.ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి అభిమానులతో పంచుకుంది.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఇక ఈ వీడియో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ప్రజలు కోవిడ్ తో బాధపడుతూ ఉంటే ఆదుకోవాల్సింది పోయి డ్యాన్స్ లు చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ఇయర్ సెకండాఫ్ లో సందడి చేయనున్న మన స్టార్ హీరోలు...

Advertisement

తాజా వార్తలు