వీడియో: మేకను జలగలా పట్టుకున్న డేగ.. ఈ పోట్లాట చూస్తే గుండెలు అదురుతాయి..!

అడవిలో ప్రతి జీవికి కూడా ఇతర జీవి నుంచి ప్రాణహాని ఉంటుంది.ఇక్కడ ఒకటి బతకాలంటే మరొకటి చావాల్సిందే.

ప్రకృతి అందాలతో కనుల విందు చేసే అడవిలో నిత్యం అత్యంత భయంకరమైన వేటలు కొనసాగుతుంటాయి.వీటిలో కొన్నింటిని చూస్తే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టాల్సిందే! అలాంటి ఒక వేట ఇటీవల కెమెరాకు చిక్కింది.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న 56 సెకన్ల వీడియో ఓపెన్ చేస్తే ఒక పెద్ద డేగ ఒక కొండ మేకను తన కాళ్ల గోళ్లతో జలగలా పట్టుకోవడం చూడవచ్చు.నిజానికి డేగ ఒక్కసారి ఉడుంపట్టు పట్టిందంటే దానిని విడిపించుకోవడం అసాధ్యమే.

Advertisement

డేగ కాళ్ల గ్రిప్ అంతలా పవర్‌ఫుల్ అని వైల్డ్ లైఫ్ ఎక్స్‌పర్ట్స్ కూడా చెబుతుంటారు.అయితే వీడియోలో కనిపిస్తున్న మేక దాదాపు డేగకి సమానమైన సైజులోనే కనిపించింది.

దీంతో ఈ మేకను ఆ డేగ ఎత్తుకుపోవడం ఖాయమనిపించింది.కానీ ఈ మేక తన ప్రాణాలను అంత సులువుగా వదులుకోవాలనుకోలేదు.

ఎలాగో తన ప్రాణాలు పోతాయి.కానీ చివరిగా ఓ ప్రయత్నం చేస్తే పోయేదేముంది అనుకొని ఆ మేక ఊహించని విధంగా డేగకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది.

తనపై వాలి తనని ఎత్తుకుపోవాలని అనుకున్న డేగకు మేక చుక్కలు చూపించింది.ఎత్తైన కొండ పైనుంచి దొర్లుతూ అది కొండ రాళ్లకు బలంగా తన వీపుతో డాష్ ఇచ్చింది.

ఛీ.. థూ, ఇజ్రాయెల్ వ్యక్తిపై ఉమ్మి వేసిన ఐరిష్ మహిళ.. రెస్టారెంట్‌లో దారుణం..
రోడ్డుపై ఆవు అరాచకం.. తల్లి, బిడ్డపై దాడి.. షాకింగ్ వీడియో వైరల్!

ఆ వీపుపైనే ఉన్న డేగకు చాలా గట్టిగా రాళ్లు తగిలాయి.

Advertisement

బండరాళ్లకు మేక వీపుకు మధ్య అది నలిగిపోయింది.అంతేకాదు, మేక మట్టిలో దొర్లుతూ చాలా వేగంగా కిందికి వచ్చింది.ఈ క్రమంలో డేగ ఒళ్లు హూనమైపోయింది.

అలా ఒక నిమిషం పాటు డేగకి మేక ఊపిరాడనివ్వలేదు.అయినా కూడా ఈ భయంకరమైన పక్షి పట్టు వదలలేదు.

చివరికి ఈ మేక ఒక బండరాయి కేసి డేగను తన వీపుతో నలిపేసింది.ఆ దెబ్బకు డేగకు కళ్లుబైర్లుకమ్మాయి.

ఆ తర్వాత కూడా మేక లేచి వేగంగా ఉరుకుతుంటే డేగ భయంతో వణికిపోయింది.మళ్లీ మేక తనిని దేనికి గుద్దుతుందో అని ప్రాణభయంతో హడలిపోయింది.

ఆ వెంటనే దానిని వదిలేసింది.అలా మేక తన సమయస్ఫూర్తి, ధైర్యంతో ప్రాణాలను బతికించుకుంది.

ఈ పోట్లాట జరుగుతున్నప్పుడు పక్కనే ఇంకొక మేక కూడా ఉరికొచ్చింది.ప్రమాదంలో ఉన్న మేకకు సహాయం చేయాలనుకుంది.

చూస్తుంటే ఈ రెండు మేకలు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలుస్తోంది.ఏదేమైనా ఈ వేటలో మేక అనూహ్యంగా ప్రాణాలు రక్షించుకొని ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

తాజా వార్తలు