వైరల్ వీడియో: భార్య తన గుండె చీల్చేందుకు వస్తోంది అంటున్న భర్త..! అసలు మ్యాటరెంటంటే..?!

ఎలాంటి అవసరం అయినా సరే.ఎలాంటి సమస్య అయినా సరే.

ఏ విషయం అయినా సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేయొచ్చు.

ఇకపోతే, ఓ వ్యక్తి తనకు ప్రాణాపాయం రాగా.

కాపాడండి అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్థన చేశాడు.ఇకపోతే సదరు వ్యక్తికి ప్రాణాపాయం ఎదురైంది ఎవరి వల్లో కాదు.ఆ వ్యకి భార్య వల్లే కావడం ఇక్కడ విశేషం.

తన భార్య తన గుండె చీల్చేందుకు ప్రయత్నం చేస్తోందని, తనను ఎలాగైనా కాపాడాలంటూ ఆయన ఏడుస్తూ రోడ్డుపై పరుగులు పెట్టాడు.కాకపోతే, ఈ ఘటన వెనుక ఒక కామిడీ ఇన్సిడెంట్ ఉంది.

Advertisement
Viral Video Husband Running To Protect His Life From Wife In Agra , Wife, Husaba

అదేంటో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవడమే కాకుండా పగలబడి నవ్వుకుంటారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో అసలు విషయం ఏంటో ఇప్పుడు ఓసారి తెలుసుకుందాం.

ఈ వైరల్ వీడియోలో పరుగులు పెడుతున్న వ్యక్తి చెప్పిన ఒక్క డైలాగ్ కారణంగా అతని భార్య కత్తి చేతపట్టి అతని వెంట పడిందని.తన భార్య భయంతో రోడ్డుపై పరుగులు తీసిన వ్యక్తి తన సెల్ఫీ కెమెరాను ఆన్ చేశాడు.

అందులో భయంతో పెద్ద ఎత్తున ఏడుస్తూ.తనకు సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు.

తన జీవితం ప్రమాదంలో ఉందని, తనను రక్షించాలని అంటున్నాడు.

Viral Video Husband Running To Protect His Life From Wife In Agra , Wife, Husaba
ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

వీడియోలో అతని పరుగులు, ఏడుపు, భయం చూసి అందరికీ అయ్యోపాపం అనిపించక మానదు.అలా వీడియో జరుగుతున్న సమయంలో అతను చెప్పిన విషయం వింటే మాత్రం నవ్వురాకమానదంటే అతిశయోక్తి కాదు.ఇంతికి అంతలా ఏం మాట్లాడటం జరిగిందంటే.

Advertisement

తాను ఆగ్రా నగరం నుంచి బయటకు వచ్చానని.రోడ్డుపై పరుగులు తీస్తున్నానని.

నిన్న నా భార్య పక్కన కూర్చున్నప్పుడు మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు? అని ప్రశ్నించిందని చెబుతూనే.ఆ సమయంలో తాను దిల్ చీర్ కే దేఖ్ టెరాహి నామ్ హోగా (నా గుండె చీల్చి చూడు నీ పేరే ఉంటుంది) అని సరదాగా సమాధానం ఇచ్చానని తెలిపాడు.

దాంతో తన మాటను సీరియస్‌ గా తీసుకున్న నా భార్య కత్తి పట్టుకుని గుండెను చీల్చి చూస్తానంటూ వెంటపడుతోందని బాధిత వ్యక్తి ఆ వీడియోలో వాపోయాడు.దీంతో పూర్తి విషయం విన్న తరువాత నోరెళ్లబెట్టడం నెటిజన్స్ వంతైంది.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అదికాస్తా ఇప్పుడు వైరల్‌ గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆయనకి సానూభూతి ప్రకటించడంతో పాటు అనేక ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.ఈ వైరల్ వింత వీడియోనూ మీరూ వీక్షించండి.

తాజా వార్తలు