వైరల్ వీడియో.. కారం కారంగా, చల్ల చల్లగా పచ్చిమిర్చి ఐస్ క్రీమ్‌ని టేస్టు చేసారా?

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఐస్ క్రీమ్ ( Ice cream )అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.

ఇక వేసవి కాలంలో ప్రతి రోజు చిన్న పిల్లలు , పెద్దవారు అందరూ చల్లగా ఉండేందుకు ఐస్ క్రీమ్ తినడానికి బాగా ఇష్టపడతారు.

అలాగే ఈ ఐస్ క్రీమ్ లలో వెనిలా, చాక్లెట్, ప్రూట్ నట్, సీతాఫలం, స్ట్రాబెర్రీలు లాంటి అనేక రకాలు మన ఇండియన్ మార్కెట్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఐస్ క్రీమ్ చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు .

అది ఏమిటి అంటే.? పచ్చి మిరపకాయలతో ( green chillies )తయారు చేసిన ఐస్ క్రీమ్ రోల్( Ice cream roll ).ఇక మరికొందరికి అయితే ఈ చిల్లి ఐస్ క్రీమ్ అసలు ఎవరికి ఊహకు కూడా అందడం లేదు.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక వ్యక్తి కొన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసి అందులో పాలను కలుపుతూ ఐస్ క్రీమ్ డెజర్ట్ ను తయారు చేస్తున్నాడు.

దానికి కొన్ని ఆకుపచ్చ సాస్ జోడించి వాటిని పచ్చిమిరపకాయలు చట్నీ లాగా తయారుచేసి ఆపై అందులో కొంచెం పాలు పోసి, మిల్కీ ఐస్ క్రీం టచ్ ఇచ్చాడు.అనంతరం ఆ మిశ్రమాన్ని మొత్తం పదేపదే కలిపి ఒక గుజ్జు పదార్థంగా తయారు చేశాడు.

Advertisement

ఇక ఆ మిశ్రమాన్ని పల్చగా చేసి ఆపై ముక్కలుగా కట్ చేసి రోల్స్ లాగా చుట్టి ఒక ప్లేట్లో పెట్టాడు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.ఎవరు ఊహించని విధంగా ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కాంబినేషన్ చూసి నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.ఇదేం కర్మ రా బాబు అంటూ కొందరు కామెంట్ చేస్తుంటే.

ఇలాంటి ఐస్ క్రీమ్ కూడా ఉంటుందా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

'మన హక్కు హైదరాబాద్' అంటూ కర్టెన్ రైజర్ ప్రచార గీతం..
Advertisement

తాజా వార్తలు