వీడియో వైరల్: రైలు పట్టాలపై తెగ తిరిగేస్తున్న చేపలు..!

ప్రస్తుతం దేశంలో భారీ వర్షాలతో ప్రజలు అల్లాడి పోతున్నారు.ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి .

దింతో ప్రముఖ పుణ్యకేత్రాల కార్యక్రమానికి వెళ్లిన అనేకమంది ఇబ్బందులకు గురవుతున్నారు.ఇక మరోవైపు తాజాగా ముంబైలో( Mumbai ) కురిసిన వర్షానికి నగరంలో జనజీవనం పూర్తిగా స్తంభించింది.

ముంబై నగరం మొత్తం జలమాయమై పోయింది.ఇళ్లలో, వీధిలో, రోడ్లు అని తేడా లేకుండా ఎటు చూసినా కూడా వరద నీరుతో( Flood Water ) కనపడుతుంది.

ఇకపోతే తాజాగా ముంబై నగర వర్షానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముంబైలో రైలు పట్టాల( Mumbai Railway Tracks ) మీద కూడా నీళ్లు ఆగి పోయాయి.ఇది ఇలా ఉండగా.

Advertisement

రైలు పట్టాల మధ్యలో నిలిచిపోయిన నీటిలో చేపలు( Fishes ) తిరగడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.ముంబైలోని ప్రముఖ రైల్వే స్టేషన్ లో పట్టాల మధ్య చేపలు తిరుగుతూ ఉండడం చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

అలా చేపలు ట్రాక్ మధ్యలో నీళ్లలో అటుఇటు తిరుగుతుండగా కొందరు వాటిని వీడియో తీసి సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేసారు.ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఇక మరికొందరైతే ఆ చేపలను పట్టుకునే ప్రయత్నాలు చేయగా అవి అక్కడి నుంచి పారిపోయాయి.

ఇంకా ఈ వీడియోను చూసిన కొంత మందిని నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తూ.ముంబైలో ఫ్రీగా చేపలు దొరుకుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.ఇలా పలు సార్లు వరదనీటిలో చేపలు, మొసళ్ళు కనపడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక మరికొందరు నెటిజన్స్ అయితే చేపలు ఎం కర్మ మరికొంతమంది ప్రజలు రోడ్లపై నీటిలో వాహనాలతో స్విమ్మింగ్ చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.

పాస్‌పోర్ట్ లేకుండా ఇండియాలోకి ఎంట్రీ.. బంగ్లా యూట్యూబర్‌ షాకింగ్ ఇన్ఫో..
Advertisement

తాజా వార్తలు