వైరల్ వీడియో: బూమ్రా పెళ్లిని తట్టుకోలేక విరహగీతం పాడిన స్టార్ హీరోయిన్..!

క్రీడాకారులకు, సినిమా హీరోయిన్లకు మధ్య లవ్ ఎఫైర్స్ ఉండటం సర్వసాధారణ విషయమే.ముఖ్యంగా భారతదేశంలో క్రికెటర్లకు, మూవీ హీరోయిన్లకు మధ్య ఎన్నో లవ్ ఎఫైర్ నడిచాయి.

విరాట్ కోహ్లీ-అనుష్క శర్మల మధ్య కొనసాగిన ప్రేమాయణం అందరికీ తెలిసిందే.ఇంకా ఇతర క్రికెటర్లు, హీరోయిన్ల మధ్య ప్రేమాయణం కొనసాగిందని ఎన్నో వార్తలు వచ్చాయి.

ఆ వార్తల్లో నిజమెంతో అబద్ధమెంతో దేవుడెరుగు కానీ ప్రస్తుతం మలయాళ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ల మధ్య లవ్ ఎఫైర్ నడిచే ఉంటుందని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.గతంలో కూడా వీరిద్దరి మధ్య రొమాంటిక్ రిలేషన్ షిప్ నడుస్తోందని అనేక వార్తలు వచ్చాయి.

అయితే ఆ వార్తలను బలపరుస్తూ ఇప్పుడు ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.నిజానికి నిన్ననే జస్‌ప్రీత్ బుమ్రా స్టార్ స్పోర్ట్స్ ప్రెజంటర్ సంజనా గణేషన్ ని పెళ్లి చేసుకున్నారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే అనుపమ పరమేశ్వరన్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.ఆ వీడియోలో అనుపమ ఒక విరహ గీతం పాడుతూ అందర్నీ ఆశ్చర్యపరిచారు.

జస్‌ప్రీత్ బుమ్రా పెళ్లయిన మరుసటి రోజే ఆమె ఒక విషాదకరమైన పాటపాడుతూ తన హార్ట్ బ్రేక్ అయినట్టు వీడియో పెట్టడంతో నెటిజన్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.బుమ్రా హ్యాండిచ్చి వేరొక యువతిని పెళ్లి చేసుకోవడంతో అనుపమ తీవ్ర బాధలో మునిగిపోయారని.

అందుకే ఈ విషాదకరమైన పాట పాడారని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.అయితే ఇది మలయాళ పాట కావడంతో అర్థం తెలియక చాలామంది అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

"జీవితం అనేక మలుపులు తిరుగుతుంది కానీ గుండె రాయి చేసుకుని ఏదో ఒక దారి వెతుక్కొని మనసులోని మాట వింటూ ముందుకు నడవాలి" అనేది ఆ మలయాళ పాట సారాంశం.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..

కొద్ది వారాల క్రితం బుమ్రా కోసం అనుపమ గుజరాత్ వెళ్లారని ప్రచారం జరగడంతో అనుపమ తల్లి స్పందించారు.అనుపమ కి, బుమ్రా కి ఎటువంటి సంబంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.కానీ తాజాగా అనుపమ విడుదల చేసిన వీడియోతో వీళ్ళిద్దరి లవ్ ఎఫైర్ పై ఇంకా పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు