వైరల్ వీడియో: మేక కు బాటిల్ తో బాధపడుతున్న శునకం..!

ఈ మధ్య సోషల్ మీడియాలో జంతువులకు, పక్షులకు సంబందించిన వీడియోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి.

జంతువులు చేసే పనులను వీడియో రూపంలో తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి.

అయితే ఇలాంటి వీడియో మరొకటి ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక కుక్క పక్కనే ఉన్న ఓ బుజ్జి మేకకు పాలు ఇచ్చింది.

ఏంటి అవాక్కయ్యారా కుక్క ఏంటి? మేక పిల్లకు పాలు ఇవ్వడం ఏంటి అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే.వీడియోలో కనిపించే కుక్క ఓక బాటిల్ సాయంతో బుజ్జి మేకకు పాలు పడుతుంది.

ఆ రెండు జంతువులు ఒక జాతికి చెందినవి కావు.కానీ ఆ రెండు జంతువులు మధ్య ఉన్న సఖ్యత చూస్తే ఎవరన్నా ఆశ్చర్యపోతారు.

Advertisement

ఈ వీడియోను ట్విట్టర్‌ లో బ్యూటెంగేబీడెన్ అనే యూజర్ పోస్ట్ చేసారు.ఈ యూజర్ ఇలాంటి వీడియోలను పోస్ట్ చేయడం కొత్తేమి కాదు.

ప్రతి నిత్యం ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తూనే ఉంటారు.ప్రస్తుత వీడియోకు గుడ్ బాయ్అనే క్యాప్షన్‌ కూడా పెట్టాడు.

ఈ వీడియో నెటిజన్ల మనసును పూర్తిగా గెలుచుకుంటుంది.పాపం ఆ బుజ్జి మేకకు ఎంత ఆకలి వేసింది ఏమో వాళ్ళ అమ్మ అందుబాటులో లేకనో మరే కారణం చేతనో అక్కడ ఉన్న కుక్క మేక ఆకలి గ్రహించి పాలతో నిండిన ఒక బాటిల్‌ ను మేక నోటిలో వాలుగా పట్టుకొంది.

అప్పుడు మేక ఆ బాటిల్ లో ఉన్న పాలను చకచక తాగేయడం మనం గమనించవచ్చు.బిడ్డ ఆకలి అమ్మకే తెలుస్తుంది అంటారు కదా.కానీ ఇక్కడ ఈ బుజ్జాయి ఆకలిని అమ్మ స్థానంలో ఉండి ఒక శునకం తీర్చింది.ఇలా కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ జంతువుల అనుంబంధాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేరు.ఇప్పటికే ఈ వీడియోకు వేల సంఖ్యలో లైక్స్ తో పాటు షేర్స్ కూడా వచ్చాయి.

Advertisement

మరి మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూసి ఆనందించండి.

తాజా వార్తలు