వైరల్: వెడ్డింగ్ రింగ్ పోగొట్టుకున్న యువకుడు.. చివరకు..?!

జేమ్స్ రాస్ అనే ఒక యూకే వ్యక్తి ప్రేమికుల రోజు నాడే తన భార్య ఎంతో ప్రేమతో పెళ్లి రోజున తన వేలుకు తొడిగిన వెడ్డింగ్ రింగ్ ని పొరపాటున చెత్తబుట్టలో పారేసుకున్నాడు.

ఆయన దాదాపు పది అడుగుల ఎత్తు గల చెత్త బుట్ట యొక్క మూత తెరిచే క్రమంలో వెడ్డింగ్ రింగ్ చేతి వేలు నుంచి జారి కింద పడిపోయింది.

అయితే చెత్త పారోబోస్తున్న సమయంలో బాగా చలి ఉండటంతో జేమ్స్ రాస్ గజగజ వణికిపోయాడు.అందుకే తన వేలు నుంచి ఉంగరం జారిపోయిన విషయాన్ని వెంటనే గమనించలేక పోయాడు.

ఐతే అక్కడి పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరించి రీసైకిలింగ్ సైట్ కి తరలించారు.ఈలోగా జేమ్స్ రాస్ తన పెళ్లి ఉంగరం పోయిన విషయాన్ని గ్రహించాడు.

దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ప్రేమికుల రోజున వెడ్డింగ్ రింగ్ పోగొట్టుకొని భార్య వద్దకు వెళ్తే ఎన్ని తిట్లు తిడుతుందోనని చాలా భయపడ్డాడు.

Advertisement

ఆ తర్వాత బయటికి వెళ్ళిన అతనికి కార్లను చెక్ చేసే ఒక ఉద్యోగిని కనిపించారు.ఆయన ఆమె వద్దకు వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు.

దీంతో వెంటనే స్పందించిన ఆమె మీరేం బాధపడకండి అని చెప్పి 4 పారిశుద్ధ్య కార్మికులు పిలిచి వెడ్డింగ్ రింగ్ వెతికి తెచ్చి పెట్టాలని కోరింది.దీనితో వారు రిసైక్లింగ్ సైట్ కి వెళ్లి 10 అడుగుల మేర పేరుకున్న చెత్తలో 20 నిమిషాల పాటు వెతికి వెడ్డింగ్ రింగ్ ని కనుగొనగలిగారు.

అనంతరం జేమ్స్ రాస్ కి తిరిగి ఆ వెడ్డింగ్ ఇచ్చేశారు.దీంతో అతడు బాగా సంతోష పడిపోతూ తన వెడ్డింగ్ రింగ్ ని వెతికి తెచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపాడు.

ఈ విషయాన్ని అక్కడి యూకె అధికారులు ఫేసుబుక్ వేదికగా వెల్లడించారు.దీంతో నెటిజన్లు యూకే పారిశుద్ధ్య కార్మికులను తెగ పొగిడేస్తున్నారు.

పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు