వైరల్: గాల్లో ఉండగానే తెగిన తాడు... లక్కీ టూరిస్ట్ అంటే ఇతడే!

సోషల్ మీడియా వాడకం బాగా పెరిగాక మన చుట్టూ జరుగుతున్న అంశాలనే కాకుండా ప్రపంచం నలుమూలలా జరుగుతున్న అనేక విషయాలను మనం తెలుసుకోగలుగుతున్నాం.

ఇకపోతే మీకు బంగీ జంప్ గురించి తెలిసే ఉంటుంది.

అదేనండి మన మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) బావగారు బాగున్నారా సినిమాలో చేసిన రియల్ స్టంట్ గుర్తుందా? దానినే బంగీ జంప్( Bungee jump ) అని అంటారు.ఇప్పుడు మీకు గుర్తుకొచ్చే ఉంటుంది.

ఇపుడు దీనిగురించి ఎందుకంటారా? విషయమే దానిగురించి మరి.

విషయంలోకి వెళితే, తాజాగా హాంకాంగ్‌కు( Hong Kong ) చెందిన 39 ఏళ్ల టూరిస్టు 30 మీటర్లు ఎత్తైన పది అంతస్తుల నుంచి బంగీ జంప్ చేస్తున్న సమయంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది.దాంతో అతగాడు చావు అంచుల వరకూ వెళ్ళొచ్చాడు.అతగాడు జంప్ చేస్తున్న సమయంలో అనూహ్యంగా తాగు తెగిపోవడంతో పెను ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

అయితే భూమిమీద నూకలు మిగలడం అంటారు కదా.ఆ మాదిరి అతగాడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.కాగా బాధితుడు తన బాధాకరమైన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

దాంతో ఈ వీడియో వైరల్ అయ్యింది.మైక్ అనే అతగాడు ఈ సంవత్సరం ప్రారంభంలో సెలవులను ఎంజాయ్ చేయడానికి స్నేహితుడితో కలిసి థాయ్‌లాండ్‌లోని ( Thailand )పట్టాయాలో పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ సమయంలో బంగీ జంపింగ్‌కు వెళ్లాలని అనుకున్నారు.

దాంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.తన స్నేహితులు ఇతర యాక్టివిస్ లో పాల్గొనడానికి ఆసక్తిని చూపిస్తే.

తాను మాత్రం ఈ బంగీ జంప్ చేయాలని నిర్ణయించుకున్నట్లు మైక్ వెల్లడించాడు.మైక్ పోడియం నుండి దూకగా నీటి దిగువకు చేరుకునే మిల్లీసెకన్ల ముందు తాడు తాగడంతో నీటిలో పడిపోయాడు.

మెకానిక్‌కి జాక్‌పాట్‌ .. రూ.25 కోట్ల లాటరీ తగలడంతో..
రతన్ టాటా స్థాపించిన మొత్తం కంపెనీలు ఇవే..?

కిందన నీళ్లు ఉండడంతో అతగాడు ప్రాణాలతో బయటపడ్డాడు.

Advertisement

తాజా వార్తలు