వైరల్: బాలిక మెడలో తాళి కట్టిన బాలుడు... తెలిసి కట్టాడో, తెలియక కట్టాడో?

దేశానికి వెన్నెముకగా నిలవాల్సిన యువతీయువకులు పెనుభారంగా మారుతున్నారు.అవును, నేటి యువతలో కామవాంఛలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

చదువు మీద దృష్టి పెట్టాల్సిన సమయంలో ప్రేమ పేరుతో వెర్రి వేషాలు వేస్తున్నారు.తల్లిదండ్రులు తమ తాహతుకు మించి వారిని చదివిస్తున్నా, వారు ఆ విషయాన్ని మరిచి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు.

ప్రేమకు, ఆకర్షణకు తేడా తెలియని వయసులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు.తాజాగా, ఇంటర్‌ చదివే ఓ బాలిక, ఓ బాలుడు బరితెగించారు.

ఏకంగా బస్టాండ్‌ ని వారి పెళ్లి వేదిక చేసుకున్నారు.ఈ సంఘటన తమిళనాడులో జరగగా సోషల్ మీడియా వేదికగా సదరు వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

Advertisement

వివరాల్లోకి వెళితే.తమిళనాడులోని చిదంబరానికి చెందిన ఓ బాలిక ఇంటర్‌ చదువుతోంది.

అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు.కొద్దిరోజుల నుండి వీరు బాగా చనువుగా తిరుగుతున్నారు.

ఈ క్రమంలో ఇద్దరూ గాంధీ విగ్రహం దగ్గరలో ఉన్న ఓ బస్టాండ్‌ దగ్గర కలుసుకొని, బాలిక మెడలో పసుపు తాడు కట్టాడు.పక్కనే ఉన్న మరికొందరు వారికి మద్దతుగా అల్లరి చేస్తూ.పూలు చల్లారు.

అక్కడే వున్న ఓ స్టూడెంట్ దీన్నంతా వీడియో తీయగా ఆ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియో ఎక్కడెక్కడికో వెళ్లి, చివరికి పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.దాంతో వారు ఆ వీడియోపై సీరియస్‌ అయ్యారు.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
పుష్ప 2 సినిమా కోసం ఫాహాద్ ఫజిల్ ఎంత రెమ్యూన రేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.తాజాగా ఆ యువకుడ్ని, యువతిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలుస్తోంది.ఇటీవలికాలంలో ఇలాంటివి ఎక్కువైపోయాయి.

Advertisement

కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఓ కంట కనిపెడుతూ ఉండాలి.

తాజా వార్తలు