వైరల్: మీరు ఎప్పుడైనా నాలుగు కాళ్లు ఉన్న మనిషిని చూసారా..?!

ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు దాగి ఉన్నాయి.కొన్ని మనకు తెలిసినవి అయితే మరికొన్ని ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నలలాగా మిగిలిపోతాయి.

అయితే ఇప్పుడు అలాంటి ఒక మహిళ జన్మ గురించిన రహస్యం కూడా ఎవరికీ తెలియని పుస్తకంలా మిగిలిపోయింది.ఆ మహిళ జీవితం ఒక పుస్తకం అయితే అందులోని కొన్ని పేజీలు మాత్రమే ప్రపంచానికి తెలిసాయి.

మిగతావి మాత్రం అలానే అంతు చిక్కని ప్రశ్నలుగా మిగిలిపోయాయి.అసలు ఇంతకు ఆ మహిళ ఎవరు.

ఎందుకు ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నాం అనే సందేహం మీలో కలగవచ్చు.ఆమె గురించి మీకు చెప్పడానికి ఒక విచిత్రమైన కారణం ఉంది.

Advertisement

అదేంటంటే.ఆ మహిళ సాధరణ మనువులలాగా రెండు కాళ్లతో జన్మించలేదు.

నాలుగు కాళ్లతో జన్మించింది.ఏంటి షాక్ అయ్యారా.

ఈ ఒక్క విచిత్రమే కాకుండా ఆమె జీవితంలో మరెన్నో విచిత్రాలు జరిగాయి.మరి ఆ మహిళ ఎవరు.

ఆమె జీవితంలో జరిగిన విచిత్ర పరిణామాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.ఆ మహిళ పేరు మైర్‌ట్లే కార్బిన్‌ .ఈ పేరు ప్రపంచానికి కొత్తేమి కాదు.ఒక్కటిగా కనిపించే ఈమెలో ఇద్దరు ఉన్నారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

కొన్ని జన్యు లోపాల కారణంగా కార్బిన్ ఇలా జన్మించింది.కార్బిన్ 1868లో లింకన్‌ కౌంటీలో నాలుగు కాళ్లతో జన్మించినది.

Advertisement

ఇలా విచిత్రంగా జన్మించినప్పటికీ కార్బిన్‌ మాత్రం 60 ఏళ్లు వరకు జీవించి అందరిని ఆశ్చర్యపరిచింది.నిజానికి కవలలుగా పుట్టాలిసిన పిల్లలు లోపల పిండం వృద్ధిచెందకపోవడం వల్ల ఒకరిగా జన్మించింది.

ఇలా పుట్టడాన్ని డిపైగస్‌ అంటారని అప్పట్లో డాక్టర్లు తెలిపారు.ఇంకో విచిత్రం ఏంటంటే కార్బిన్ నాలుగు కాళ్లతో మాత్రమే కాకుండా రెండు జననేంద్రియాలు, రెండు గర్భాశయాలను కలిగి ఉంది.

చూడడానికి మైర్‌ట్లే కార్బిన్‌ నడుము పైభాగం వరకు మాములు మనుషుల మాదిరిగానే ఉన్నా కింద భాగం మాత్రం నాలుగు కాళ్లతో ఉంటుంది.వాటిలో ఒక కాలు మాత్రమే పని చేసేది అంట.అలా ఒక్కో కాలికి ఐదు వేళ్ళు కాకుండా మూడేసి వేళ్లు మాత్రమే ఉండేవి.ఈ విచిత్ర రూపం వలన ఆమె అప్పట్లో ఒక సెలబ్రిటీ అయింది.

అలా ఒక సర్కస్‌ కంపెనీలో ఆమె జాయిన్ అయింది.చిన్న వయసులోనే బాగానే సంపాదించేది.

ఆ తర్వాత కార్బిన్‌ క్లింటన్‌ బిక్‌నెల్‌ అనే డాక్టర్‌ ను పెళ్లి చేసుకుని సర్కస్‌ లో పనిచేయడం ఆపేసింది.ఇంట్లోనే ఉండేది అలా ఒక రోజు ఉన్నటుండి ఎడమ వైపు కడుపులో నొప్పి రావడంతో హాస్పిటల్ కి వెళితే ఆమెని పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని చెప్పారు.

అయితే అప్పుడే కార్బిన్ కు రెండు గర్భాశయాలు ఉన్నాయి అనే విషయం తెలిసింది.అలా కార్బిన్‌ నలుగురు ఆడపిల్లలు, ఒక మగ బిడ్డకు జన్మ నిచ్చింది.ఆ తర్వాత 1928లో కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆవిడ మరణించింది.

చనిపోయిన ఆమె భౌతిక దేహాన్ని పరిశోధనల నిమిత్తం తమకి ఇవ్వమని, అలా ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇస్తామని వైద్యులు అడిగిన ఆమె కుటుంబ సభ్యులు అందుకు నిరాకరించారు.అలా ఆమె సమాధిని స్ట్రాంగ్ గా ఉండేలా కాంక్రీట్‌ తో నిర్మించి అది ఆరి గట్టిపడేవరకు అక్కడే కాపలా కాచారట.

ఆమె జన్మ నిచ్చిన ఐదుగురు పిల్లలు కూడా ఒకే కడుపున పుట్టలేదని, రెండు వేర్వేరు గర్భశయాల్లో పుట్టారనే ఊహాగానాలు అప్పట్లో వచ్చాయి.ఏది ఎలా ఉన్నా కార్బిన్ పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఒక తెల్ల పేపర్ మాదిరిగానే ఉండి పోయింది.

తాజా వార్తలు