వైరల్: ప్రియురాలి కోసం ఈ ప్రియుడు ఏకంగా..!?

కరోనా మహమ్మారి వలన ఎన్నో దేశాలు అతలాకుతలం అయిపోయాయి.ఎంతోమంది ప్రాణాలు సైతం కోల్పోయారు.

ఇంకా ఈ మహమ్మారి మనల్ని వదిలిపోలేదు.కరోనా వైరస్ కారణంగా ప్రజలు అడుగు బయట పెట్టాలంటే చాలు బయపడిపోతున్నారు.

ఉద్యోగులు సైతం ఆఫీస్ లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఉద్యోగం చెసుకుంటున్నారు.స్టూడెంట్స్ పరిస్థితి అయితే మరి దారుణం.

స్కూల్స్, కాలేజిలు మూత పడ్డాయి.పిల్లలు అందరు ఇంటికే పరిమితం అయిపోయారు.

Advertisement

ఏవో ఆన్లైన్ క్లాసులు మాత్రం వింటున్నారు.ఎంత ఆన్లైన్ క్లాసులు విన్నాగాని కొంతమందికి మాత్రం సబ్జెక్టు మీద పట్టు రావడం లేదు.

ఇలాంటి పిల్లలు పరీక్షలంటే భయపడిపోతున్నారు.ఈ క్రమంలోనే ఒక యువతి కూడా పరీక్షలంటే భయపడి పోయి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉంది.

ప్రియురాలు బాధని అర్ధం చేసుకున్న అమర ప్రేమికుడు ఏకంగా తానే పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు.అది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా.? అతను మాత్రం ఏమి చేస్తాడు చెప్పండి ప్రేమించాడు కదా ఎంతటి సాహసం అయిన చెయ్యాలి అనుకుని ఏకంగా ప్రియురాలు వేషం వేసి పరీక్ష రాయాలని ఆలోచన చేసాడు.చివరికి ఏమైందో మీరే చూడండి.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే పశ్చిమ ఆఫ్రికా ఖండంలోని సెనెగల్ దేశానికి చెందిన ఖాదీమ్ ఎంబూప్ అనే యువకుడు గాస్టన్ బెర్గర్ యూనివర్సిటీలో చదువుతున్నాడు.అతనికి గంగూ డియోమ్ అనే ఒక ప్రేయసి ఉంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

అయితే ఆమెకు హైస్కూల్ గ్రాడ్యూయేషన్ పరీక్షలు జరగబోతున్న సమయంలో పరీక్షలు రాసి పాస్ అవుతాననే నమ్మకం లేక అయోమయ పరిస్థితిలో ఉంది.ప్రియురాలి బాధను అర్ధం చేసుకున్న ప్రియుడు తానే ప్రేయసి గెటప్ వేసేసాడు.

Advertisement

గంగూ డియోమ్ లాగా డ్రెస్, మేకప్ వేసుకుని ఎవరికీ ఏ చిన్న అనుమానం రాకుండా మూడు రోజులు పాటు పరీక్ష రాసాడు.కానీ, నాలుగో రోజు అతని పప్పులు ఉడకలేదు.అతనిపై ఇన్విజిలేటర్‌ కు అనుమానం వచ్చి అతన్ని సోదా చేయగా అసలు విషయం బయట పడింది.

ఇంకేముంది అక్కడ పోలీసులను పిలిచి అతని వాళ్ళకి అప్పగించారు.వారు అతన్ని విచారించగా.

తన ప్రియురాలి కోసమే ఇలా వేషం వేసి పరీక్ష రాసినట్లు అంగీకరించాడు.దాంతో ఈ ప్రేమ జంటపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.

ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో అది కాస్త వైరల్ అయింది.ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ పెడుతున్నారు.

ప్రియురాలి కోసం ప్రియుడు ఎంతకయినా తెగిస్తాడు అనడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

తాజా వార్తలు