తిరుమల శ్రీ వేంకటేశ్వరుని బంగారు గోపురం పై విమాన వెంకటేశ్వరస్వామి ఎవరి కోసము?

కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్న ప్రదేశంలో బంగారు గోపురం పైన వెండి ద్వారంలో కొలువై శ్రీ వెంకటేశ్వర స్వామి ఉంటారు.

(వెండి ద్వారం గోపురం పైనున్న స్వామి ప్రదేశాన్ని చూపేందుకు ) దర్శనం అయ్యాక చాలా మంది గోపురం పైన ఉన్న స్వామి ని చూసి దర్శించి నమస్కరిస్తుంటారు.

వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని పిలుస్తారు.మహా విష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వేంకటేశ్వరుని తీసుకొచ్చారు.

ఆ దర్శనం .ఆకాశాన్నించి ముక్కోటి దేవతలు దిగి వచ్చి స్వామిని సేవించుకోవటం కోసం మరియు పశు పక్షాదుల కోసము.మన పగలు, రాత్రితో వారికి సంబందం లేదు.

గనుక వారి పూజా సమయం వేరు గనుక, భూమి క్రిందున్న, భుమిపైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది.తిరుమల వెళ్ళిన వారు తప్పనిసరిగా విమాన వెంకటేస్వరుడ్ని, స్వామి పాదాలనూ దర్శించటం మరవకండి.

Advertisement
రోజు నైట్ త్వరగా నిద్ర పట్టడం లేదా.. అయితే ఇకపై ఇలా చేయండి!
" autoplay>

తాజా వార్తలు