సినీ కధా రచయిత విజయేంద్రప్రసాద్ తాజాగా బీజేపీ వారి చేత రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ అయిన విషయం తెలిసిందే.
కాగా విజయేంద్రప్రసాద్ ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా ఆయన ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో గాంధీ నాడు అనుసరించిన వైఖరిని తప్పుపట్టిన విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ సినిమాలో చివరన వచ్చే పాటలో దేశంలోని స్వాతంత్ర వీరుల జాబితాలో గాంధీ,నెహ్రూల చిత్ర పటాలను ఎందుకు చూపించలేదు అన్న ప్రశ్నకు ఆయన చాలా సుదీర్ఘమైన జవాబు చెప్పారు.ఇంటర్వ్యూలో భాగంగా విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.
మహాత్మ గాంధీ దేశానికి తొలి ప్రధానిగా నెహ్రూని ఎన్నుకోవడం కోసం పటేల్ ని తీసి పక్కన పెట్టారని నాడు బ్రిటిష్ వారు దేశం విడిచిపోతూ దేశానికి ప్రధాని అభ్యర్ధిని ఎంపిక చేయమని గాంధీకి సూచించారని, నాడు కాంగ్రెస్ కి 17 పీసీసీలు ఉంటే అందులో నుంచి అభిప్రాయ సేకరణను గాంధీ జరిపితే మొత్తం 15 మంది ఏకమొత్తగ్నా పటేల్ అభ్యర్ధిత్వాన్ని ప్రధాని పదవికి ఎంపిక చేశారట.ఒకరు ఏమీ రాయకుండా ఇచ్చేస్తే మరో ఓటు ఆచార్య కృపాలనీకి వచ్చిందట.
అయితే నెహ్రూని మాత్రం ఎవరూ ప్రతిపాదించకపోవడంతో అప్పుడు గాంధీ 18వ పీసీసీగా ఢిల్లీని క్రియేట్ చేసి మరీ నెహ్రూ పేరును అలా ప్రతిపాదించి ఆయనకు తొలి ప్రధాని అయ్యే అవకాశం కల్పించారు అని విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.
ప్రజాస్వామ్యం మీద గాంధీకి విశ్వాసం ఉంటే ఇలా చేసే వారా అని కూడా విజయేంద్రప్రసాద్ ప్రశ్నించారు.అయితే ఇది చరిత్రలో కనబడని సత్యమైతే ఆయన లోతుల్లోకి వెళ్ళి దీన్ని శోధించి బయటపెట్టినట్లుగా ఉంది.అయితే మొత్తానికి ఇది పాత ఇంటర్యూ అయినప్పటికీ ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ బీజేపీ తరఫున రాజ్యసభ ఎంపీ కావడంతో బయటకు వచ్చింది.
కాగా ఇదే విషయంపై నెటిజన్స్ అనుకూల వ్యతిరేక భావనలు కూడా వ్యక్తం చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ విజయేంద్రప్రసాద్ గాంధీని వ్యతిరేకించడం ద్వారా తనది అచ్చమైన ఆరెస్సెస్ గొంతు అని రుజువు చేయడంతో పాటు పలువురు నెటిజన్ లు కామెంట్స్ కూడా చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy