కేబినెట్ మంత్రిగా విజ‌య‌శాంతి..!

వెండితెర‌పై ఎంతోమంది స్టార్ హీరోల‌తో న‌టించి ఓ వెలుగు వెలిగింది లేడీ సూప‌ర్‌స్టార్ అమితాబ‌చ్చ‌న్‌.

లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా స‌త్తా చాటిని ఆమె పొలిటిక‌ల్‌గా మాత్రం వ‌రుస‌గా ప్లాప్ షోలు వేస్తున్నారు.

ప్ర‌త్యేక తెలంగాణ కోసం త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన రాముల‌మ్మ త‌ర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసి ఆ పార్టీ నుంచి మెద‌క్ ఎంపీగా కూడా గెలిచారు.కేసీఆర్‌తో తీవ్ర‌స్థాయిలో విబేధాలు రావ‌డంతో రాముల‌మ్మ గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌లోకి జంప్ చేసి మెద‌క్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో రాజ‌కీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోయిన విజ‌య‌శాంతి గ‌త కొద్ది రోజులుగా త‌మిళ‌నాడు పాలిటిక్స్‌పై బాగా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు.అక్క‌డ చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌కు మ‌ద్ద‌తుగా గ‌ళ‌మెత్తుతున్నారు.

తమిళ‌నాడులో డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీలో వుండి కూడా విజయశాంతి శశికళ వర్గాన్ని స‌పోర్ట్ చేస్తుండ‌డంతో రాజ‌కీయంగా చాలా సందేహాల‌కు తావిస్తోంది.అమ్మ జ‌య‌ల‌లిత‌, చిన్నమ్మ లేని అన్నాడీఎంకే పార్టీలో కీల‌క‌మైన మ‌హిళ‌లు లేకుండా పోయారు.

Advertisement

దీంతో విజ‌య‌శాంతిని ప‌ళ‌నిస్వామి కేబినెట్‌లోకి తీసుకోవాల‌ని చిన్న‌మ్మ ప్లాన్‌గా తెలుస్తోంది.విజ‌య‌శాంతి త‌మిళ‌నాడు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తే అక్క‌డ అన్నాడీఎంకేకు పార్టీ గ్లామ‌ర్ కూడా యాడ్ అవుతుంద‌ని త‌మిళ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న మాట‌.

ఇక విజ‌య‌శాంతి తెలుగుమ్మాయి అయినా ఇక్క‌డ సినీజ‌నాల‌కు ఎంత ప‌రిచ‌య‌మో.త‌మిళ సినీజ‌నాల్లో కూడా ఆమెకు అంతే క్రేజ్ ఉంది.

ఆమె అక్క‌డ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ నుంచి చాలా మంది హీరోల‌తో న‌టించింది.మ‌రి విజ‌య‌శాంతి ప‌ళ‌నిస్వామి కేబినెట్‌లోకి చేరే వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజం అవుతాయో చూడాలి.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు