వైసీపీ ప్లీనరీ వేదికగా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.వైసీపీ ఆవిర్బావం నుంచి పాటు గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ కొనసాగారు.
విజయమ్మ పార్టీ కోసం ఎంతో చేశారు.ఎన్నో మీటింగ్స్ లో పాలు పంచుకున్నారు.
గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు.అయితే కొంతకాలంగా వైసీపీ రాజకీయాలకు దూరంగా ఉంటున్న విజయమ్మ ప్లీనరీ వేదికగా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
విజయమ్మ ప్లీనరీలో ఆ పార్టీ తరపున తన చివరి ప్రసంగం వినిపించారు.కూతురు షర్మిలకు తాను అండగా ఉండాల్సిన అవసరం ఉందంటూ పార్టీ పదవి నుంచి వైదొలిగారు.
అయితే ఇప్పుడు విజయమ్మ మరో కొత్త బాధ్యతను ఎత్తుకోబోతున్నారు.తెలంగాణాలో షర్మిల పెట్టిన వైఎస్సార్టీపీలో విజయమ్మ ఇక మీదట కీలక బాధ్యతలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.ఇదివరకే విజయమ్మ కూతురు పార్టీలో క్రియాశీలంగా ఊంటూ పాదయాత్రలో పలు మార్లు పాల్గొన్నారు.షర్మిలకు మద్దతుగా వైఎస్ బిడ్డను దీవించాలని కోరారు.
అయితే ఈ విషయంలో విజయమ్మ కొన్ని విమర్శలను ఎదుర్కొన్నారు.వైసీపీలో గౌరవ అధ్యక్షురాలిగా ఉంటూ.
వేరే పార్టీలో కీలకంగా ఉండటం తప్పుబట్టారు.ఇక మొత్తానికి వైసీపీకి రాజీనాయా చేసి షర్మిళతోనే పూర్తి స్థాయిలో ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే విజయమ్మ ఇక వైఎస్సార్టీపీలో గౌరవ అధ్యక్షురాలిగా కొనసాగుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందుకు షర్మిల రంగం సిద్ధం చేశారని అంటున్నారు.ఇకపై మొత్తం ఫోకస్ తెలంగాణలోనే ఉంటుందని రాజన్న బిడ్డగా షర్మిళను చూపడానికి సిద్దమైందంటున్నారు.కాగా విజయమ్మ రాకతో వైఎస్ఆర్టీపీలో ఎంతవరకు జోష్ వస్తుందనేది వేచి చూడాలి.
ఇప్పటి వరకు ఈ పార్టీలో బలమైన నేతలు చేరకపోవడంతో మరి విజయమ్మ రాకతోనైనా చేరికలు జరుగుతాయా.అని అంటున్నారు.అయితే విజయమ్మ షర్మిళ పార్టీలో ఉంటూ అక్కడ నుంచి తెలంగాణ వాణి వినిపిస్తే ఏదో ఒక విధంగా అది వైసీపీకి ఇబ్బంది పెట్టేదే అంశం అవుతుందని అంటున్నారు.మొత్తానికి చూస్తే షర్మిళకు మద్దతుగా రేపటి ఎన్నికల్లో ఆమె ప్రచారం చేయాల్సి ఉంటుంది.

అయితే ఇప్పటికిప్పుడు తెలంగాణలో విజయమ్మ ఎంట్రీ ఇచ్చినా ఎంతవరకు సక్సెస్ కాగలరనే చర్చ జరుగుతోంది.తెలంగాణలో కాంగ్రెస్ కూడా బలంగా ఉంది.ఆ పార్టీని ఢీ కొట్టి ఓట్లు తమ వైపు తెచ్చుకోవడం మిగిలిన పార్టీలను దీటుగా ఎదుర్కోవడం అన్నది కష్టతరమైన పని అనే చెప్పాలి.ఒక వైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా వైఎస్ పథకాలను ప్రచారం చేసుకుంటారు.
ఇప్పడు షర్మిళ తరఫున విజయమ్మ చెప్పేది కూడా అదే.అయితే కూతురికి విజయాన్ని కట్టబెట్టడానికి ఎంతవరకు విజయమ్మ సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే.







