అల్లూరి జిల్లా, దేవీపట్నం మండలం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాపర్ డ్యామ్ వద్దకు భారీగా చేరుకుంటున్న గోదావరి వరద.బేక్ వాటర్ కారణంగా దేవీపట్నం మండలం గొందూరు లో వెలసిన మాతృశ్రీ గండి పోశమ్మ ఆలయ గర్భగుడిలో అమ్మవారి మెడకంఠం వరకు చేరిన గోదావరి వరద నీరు.
గంట గంటకు పెరుగుతున్న వరద ప్రవాహం.
ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయం వద్దకు వరద నీరు.
దండంగి గ్రామం నుండి పోశమ్మగండి వైపుగా వెళ్ళే రహదారులు పూర్తిగా జల దిగ్బంధం.వరద ముంపులో ఖాళీ చేసిన 40 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధం.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం.







