సుహాస్ స్ట్రగులింగ్ రచయిత పాత్రలో ‘రైటర్ పద్మభూషణ్’ గా పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక.
చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.అనురాగ్, శరత్, చంద్రు మనోహర్ నిర్మాతలు కాగా మనోహర్ గోవిందస్వామి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ కన్నుల్లో నీ రూపమే లిరికల్ వీడియో విడుదలైయింది.సోల్ ఫుల్ మెలోడీ గా ఈ పాట మనసుని హత్తుకుంది.
ధనుంజయ్ వాయిస్ పాటకు మరింత ఆహ్లాదాన్ని జోడించింది.
♪♪నువ్వు నేను అంతే చాలు.
ఈ లోకంతో పని లేదు.
నువ్వే నాతో వుంటే చాలు.
ఏదేమైనా పర్లేదు.
నిన్నే చూస్తే చాలు పగలే వెన్నెలలు.
నువ్వే నవ్వితే చాలు బోలెడు పండగలు.
దారి దారంతా ఎదురొచ్చినవే.
నా కన్నుల్లో నీ రూపమే.
నా గుండెల్లో నీ ధ్యానమే ♪♪
భాస్కరభట్ల అందించిన సాహిత్యం మళ్ళీమళ్ళీ పాడుకునేలా వుంది.
ఈ పాటలో లవ్‌బర్డ్స్ మధ్య మధురమైన క్షణాలు, చిన్ని చిన్ని అలకలు, కోపాలు చాలా అందంగా చూపించారు.లీడ్ పెయిర్ సుహాస్, టీనా శిల్పరాజ్ మధ్య కెమిస్ట్రీ ముచ్చటగా వుంది.
ఈ పాట ఆల్బమ్‌లోని మిగిలిన పాటలపై మరింత ఆసక్తిని పెంచింది.వెంకట్ ఆర్ శాకమూరి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.
తారాగణం:
సుహాస్, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి.
టెక్నికల్ టీమ్ :
రచన, దర్శకత్వం: షణ్ముఖ ప్రశాంత్,
నిర్మాతలు: అనురాగ్, శరత్, చంద్రు మనోహర్,
సమర్పణ: మనోహర్ గోవింద్ స్వామి,
బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్,
సంగీతం: శేఖర్ చంద్ర,
డీవోపీ: వెంకట్ ఆర్ శాకమూరి,
ఎడిటర్: రామకృష్ణ అర్రం,
ఆర్ట్: ఎల్లయ్య ఎస్,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సూర్య చౌదరి,
పీఆర్వో: వంశీ-శేఖర్.