ఆ విషయంలో సేఫ్ గేమ్ ఆడుతున్న విజయ్.. ఆయన తెలివికి ఫ్యాన్స్ 'ఖుషి'!

విజయ్ దేవరకొండ. ఈ పేరు మన టాలీవుడ్ లో ఎంత సెన్సేషన్ నో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Vijay Devarakonda Master Plan Behind Kushi Movie, Puri Jagannadh, Vijay Deverako-TeluguStop.com

ఇతడు చేసింది కొన్ని సినిమాలు అయినా కూడా ఈయన ఫాలోయింగ్ మాత్రం ఏ యంగ్ హీరోకు లేనంత ఫాలోయింగ్ ఉంది.ఫ్యాన్స్ అంతా ముద్దుగా రౌడీ స్టార్ అని పిలుచుకునే విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన ‘లైగర్’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది.

ఏ సినిమా అయినా నెలల్లోనే పూర్తి చేసే పూరీ ఈ సినిమా కోసం అన్నేళ్లు వెచ్చించి మరీ తీర్చిదిద్దుతున్నారు అంటే ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో అని ప్రేక్షకులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అంచనాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ కాకుండానే విజయ్ పూరీ దర్శకత్వంలోనే జనగణమన సినిమా ప్రకటించాడు.

Telugu Jana Gana Mana, Kushi, Liger, Puri Jagannadh, Shiva Nirvana-Movie

ఇలా పూరీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు దేవరకొండ తోనే చేస్తున్నాడు అంటే అతడి టార్గెట్ ఒక్కటే.విజయ్ ను పాన్ ఇండియా స్టార్ ను చేయడమే.ముందుగా లైగర్ తో హిట్ ఇచ్చి పాన్ ఇండియా స్టార్ ను చేసి వెంటనే జనగణమన సినిమాతో సూపర్ స్టార్ గా తీర్చిదిద్దడానికి కృషి చేసున్నాడు.

అయితే విజయ్ లైగర్ తర్వాత జనగణమన సినిమా షూటింగ్ లో పాల్గొనాల్సి ఉండగా అది కాదని శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నాడు.

మరి విజయ్ అలా చేయడానికి ఆయన దాని వెనుక మాస్టర్ ప్లాన్ ఒకటి ఉన్నట్టు ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది.

లైగర్ సినిమా బెడిసి కొట్టినా వెంటనే విజయ్ ఖుషి సినిమాతో గట్టెక్కవచ్చు అనే ఆలోచనలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్టు టాక్.లైగర్, జనగణమన రెండు హిట్ అయితే ఈయన రేంజ్ ను అందుకోవడం అసాధ్యమే.

మరి అలా కాదని రెండు బెడిసి కొడతాయేమో అనే ఉద్దేశంతోనే విజయ్ ఖుషి సినిమాను ఈ రెండు సినిమాల మధ్య ఇరికించినట్టు తెలుస్తుంది.మరి విజయ్ ఆలోచన ఆయన ఫ్యాన్స్ ను కూడా ఖుషి చేస్తుంది అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube