తమిళ్ హీరో విజయ్ రష్మిక జంటగా తెరకెక్కుతున్న మూవీ వారసుడు’.వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ్ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతుంది.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ నుండి రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ ‘రంజితమే సాంగ్ ని మేకర్స్ విడుదల చేసారు.ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
యూట్యూబ్‌లో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది.
విజయ్ అదిరిపోయే స్టెప్స్, రష్మిక గ్లామర్, థమన్ మ్యూజిక్ ఇవన్నీ కూడా యూట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.
థమన్ టీం త్వరలోనే రెండోపాటను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది.రెండో పాటను అనిరుధ్ రవిచందర్ ఈ పాటను పాడాడు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో కుష్బూ, మీనా, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
తమిళంలో ఈ సినిమాకి వరిసు అనే టైటిల్ ను ఖరారు చేశారు.విజయ్ జోడీగా ఫస్ట్ టైమ్ రష్మిక అలరించనుంది.