Nani Meet Cute Movie :నాని సినిమా డబుల్ ఆఫర్ ఇచ్చిన సోని లివ్..!

నేచురల్ స్టార్ నాని నిర్మించిన మీట్ క్యూట్ మూవీ ద్వారా భారీ లాభాలు అందుకున్నట్లు తెలుస్తుంది.ఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే, మరోపక్క వాల్ పోస్టర్‌ సినిమా అనే ప్రొడక్షన్‌ సంస్థను స్థాపించి వరుస మూవీస్ నిర్మిస్తున్నాడు నాని.

 Nani Wise Decission To Sale His Meet Cute Movie , Nani , Meet Cute Movie, Tolly-TeluguStop.com

తాజాగా మీట్ క్యూట్ అనే మూవీ ని నిర్మించాడు.ఈ మూవీ తో నాని సోదరి దీప్తి ఘంటా దర్శకురాలిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

గతంలో ఈమె అనగనగా ఒక నాన్న అనే షార్ట్‌ ఫిలిం తెరకెక్కించింది.ఈ షార్ట్‌ ఫిలిం గొప్ప ప్రశంసలు దక్కించుకుంది.

ఇక ఇప్పుడు మీట్‌ క్యూట్‌తో ఫ్యూచర్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌గా మెగాఫోన్‌ పట్టింది.

ఆంథాలజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ప్రముఖ ఓటీటీ సంస్థ సోనిలవ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ప్రస్తుతం థియేటర్స్ లలో సినిమాల పరిస్థితి ఎలా ఉందొ తెలిసిందే.హిట్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్స్ కు వెళ్లి సినిమా చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు.

దీంతో చాలామంది నిర్మాతలు నష్టాల పాలవుతున్నారు.అందుకే నాని తాను నిర్మించిన మీట్ క్యూట్ మూవీ ని భారీ ధరకు సోనిలవ్‌ కు అమ్మేసాడట.

దీంతో ఆయన పెట్టిన పెట్టుబడికి డబుల్ వచ్చినట్లు ఫిలిం సర్కిల్లో మాట్లాడుకుంటున్నారు.ఈ మూవీ టీజర్ శనివారం విడుదలై ఆకట్టుకుంది.

ఈ మూవీలో ఆరుగురు హీరోయిన్‌లు నటించారు.రుహాని శర్మ, ఆకాంక్షసింగ్‌, ఆదా శర్మ, వర్షబొల్లమ్మ, సునైనా, సంచిత పూనాచ వంటి ఆరుగురు కథానాయిక పాత్రలు పోషించారు.

సత్యరాజ్‌, రోహిణి కీలకపాత్రలు పోషించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube